నా పుట్టుక చావు...టీఆర్ఎస్‌లోనే..బీజేపీలో చేర‌ట్లేదు

నా పుట్టుక చావు...టీఆర్ఎస్‌లోనే..బీజేపీలో చేర‌ట్లేదు

సోష‌ల్ మీడియా, డిజిట‌ల్ మీడియా ఎంత ప‌వ‌ర్ ఫుల్ అనేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అయితే ఇటీవ‌లి కొన్ని ప‌రిణామాలు ప‌లువురు నాయ‌కులకు ఇబ్బందిక‌రంగా మారుతున్నాయి. దుష్ప్ర‌చారాల‌కు వేదిక‌గా నిలుస్తున్నాయి. అలాంటి ప్ర‌చారానికి తాజాగా బ‌ల‌యింది తెలంగాణ మంత్రి హరీష్ రావు. 40 మంది ఎమ్మెల్యేల‌తో క‌లిసి హ‌రీశ్ రావు కాంగ్రెస్‌లో చేర‌బోతున్నారంటూ ఓ చానల్ చిత్రంతో మార్ఫింగ్ చేసి సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేశారు. ఈ ప్ర‌చారం వైర‌ల్ అవ‌డంతో టీఆర్ఎస్‌లో క‌ల‌క‌లం రేగింది. ఈ నేప‌థ్యంలో ఏకంగా హ‌రీశ్‌రావు స్పందించారు.

రాజకీయ లబ్ధికోసమే నా మీద దుష్ప్రచారం చేస్తున్నార‌ని హ‌రీశ్ రావు వ్యాఖ్యానించారు. హరీష్ రావు విషయంలో కలలో కూడా ఇలాంటి ఆలోచన కానీ  ఊహ కూడా ఉహించడానికి అవకాశం ఉండదని ఆయ‌న తెలిపారు. `మేం ఉద్యమాల నుంచి వచ్చినవాళ్ళం..త్యాగాల నుంచి వచ్చినవాళ్ళం...గడ్డిపోచల్లగా కేసీఆర్ గారి మాట మీద రాజీనామాలు చేసినవాళ్ళం...!! మంత్రి పదవులను రాజీనామా చేశాం. రెండు సార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాం. జైళ్లలో పోయినటువంటి వాళ్ళం...!! త్యాగాలు తెలుసు తప్ప...ద్రోహాలు తెలిసిన పార్టీ కాదు...కుటుంబం కాదు మాది...!! అటువంటి ఆలోచన ఉంటే వాళ్ళు..విరమించుకోవాలి...ఇక ముందు పిచ్చి ప్రేలాపణలు చేస్తే మాత్రం రాబోయే రోజులలో మీరు చట్ట పరమైన చర్యల కు సిద్ద పడాలని హెచ్చరిస్తున్నం` అని హ‌రీశ్ రావు రావు స్ప‌ష్టం చేశారు.

కాగా, కాంగ్రెస్ నేత‌ల‌పై హరీశ్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ నేతలు మోకాళ్లమీద యాత్రలు చేసినా..వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే గెలుపని  స్పష్టం చేశారు. ఉనికి కోసమే కాంగ్రెస్ నేతలు బస్సు యాత్ర చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు విశ్వసనీయతను కోల్పోయారని, మంచి నీళ్ల కోసం గతంలో ధర్నాలు చేస్తే..మేం ఇంటింటికి మంచినీళ్లు ఇస్తున్నమని హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్ 4 కిలోల బియ్యం ఇస్తే..మేం సీలింగ్ లేకుండా మనిషికి 6 కిలోలు ఇచ్చినమని తెలిపారు. మేనిఫెస్టోలో ఉన్న ప్రతీ అంశాన్ని అమలు చేసినమన్నారు. కాంగ్రెస్ 7 గంటల కరెంట్ కూడా ఇవ్వలేకపోయింది. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటల కరెంట్ ఇస్తున్నమని తెలిపారు.

కాంగ్రెస్ చరిత్ర ఉద్యమంలో వెనుకడుగే..రాజీనామాలో వెనుకడుగేనని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్ హామీలను అమలు చేయని మిమ్మల్ని ప్రజలు ఎలా నమ్ముతారని, ఆ పార్టీ నేతలను ప్రశ్నించారు. మీరు కరెంట్ ఇవ్వలేదు. మేం ఇచ్చినం, మీరు నీళ్లు ఇవ్వలేదు..మేం నీళ్లు ఇచ్చినం. మీరు పెండింగ్ ప్రాజెక్టులుగా మార్చితే మేం వాటిని రన్నింగ్ ప్రాజెక్టులుగా చేసినమని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ఫ్లోరైడ్ సమస్య పట్టిపీడించింది. మిషన్ భగీరథతో ఫ్లోరైడ్ సమస్యను తరిమికొట్టినం. హాస్టళ్లలో విద్యార్థులకు సన్నబియ్యంతో కడుపునిండా అన్నం పెడుతున్నమని హరీశ్‌రావు తెలిపారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English