కిమ్‌ను క‌లుస్తా...ట్రంప్ సంచ‌లన ఆఫ‌ర్‌

కిమ్‌ను క‌లుస్తా...ట్రంప్ సంచ‌లన ఆఫ‌ర్‌

ప్ర‌పంచ దేశాల‌ను క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తున్న అంశానికి తెర‌ప‌డిన‌ట్లే క‌నిపిస్తోంది. ఇన్నాళ్లు క‌త్తులు దూసుకున్న రెండు దేశాల నాయ‌కులు శాంతి మంత్రం జ‌పిస్తున్నారు. క‌య్యానికి కాలు దువ్వ‌డం కంటే శాంతితో ముందుకు సాగ‌డ‌మే మేల‌ని భావిస్తున్నారు. ఆ ఇద్ద‌రే ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్!. ఈ ఇద్ద‌రు నేత‌లు భేటీ అయ్యేందుకు అంగీకారం తెలిపారు. అత్యంత ఆశ్చ‌ర్య‌క‌రంగా ఈ భేటీకి ఆహ్వానం ప‌లికింది మొండి ఘ‌ట‌మైన కిమ్!

చ‌ర్చ‌లు జ‌రిపేందుకు దక్షిణ కొరియా బృందం ద్వారా ట్రంప్‌నకు కిమ్ ఆహ్వానం పంపారు. ఈ మేరకు వచ్చే మే నెలలో ఇద్దరు నేతలు తొలిసారి సమావేశంకానున్నట్లు దక్షిణా కొరియా దౌత్యాధికారి వెల్లడించారు. అణ్వాయుధాల నిషేధంతో పాటు.. న్యూక్లియర్, మిసైల్ టెస్టులను నిలిపివేసేందుకు కిమ్ కట్టుబడి ఉన్నారని, కిమ్‌తో సమావేశం వివరాలను ట్రంప్‌నకు దక్షిణ కొరియా ఉన్నతాధికారుల బృందం వివరించిన అనంతరం వైట్‌హౌస్ వద్ద దక్షిణా కొరియా నేషనల్ సెక్యూరిటీ ఆఫీస్ హెడ్ చుంగ్ యుంగ్ విలేకరులతో మాట్లాడారు. వీలైనంత త్వరగా ట్రంప్‌తో సమావేశం కావాలని కిమ్ ఎదురుచూస్తున్నారని ఆయన చెప్పారు. సమావేశానికి సంబంధించి వివరించిన తీరును ట్రంప్ మెచ్చుకోవడంతో పాటు అణ్వాయుధాల నిర్మూలన సాధించడానికి వచ్చే మే నెలలో కిమ్‌ను కలిసి చర్చలు జరుపుతానని ట్రంప్ చెప్పినట్లు ఆయన వివరించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు