రాష్ట్రం కోసం కొత్త జెండా

రాష్ట్రం కోసం కొత్త జెండా

రాష్ట్రాలు దేశంలో భాగం. దేశంలో అన్ని రాష్ట్రాలు స‌మానం. జ‌మ్ముక‌శ్మీర్ కున్న ప్ర‌త్యేక‌త‌ను ప‌క్క‌న పెడితే.. మిగిలిన రాష్ట్రాల‌న్నింటికి ఒకే తీరులో ఉంటాయి. రాష్ట్రాలు ఎవ‌రికి వారు అన్న‌ట్లు కాకుండా జాతీయ జెండా కింద అంద‌రం ఒక్క‌టేన‌న్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తుంటారు. తాజాగా.. క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి స‌రికొత్త తీరును ప్ర‌ద‌ర్శించారు.

త‌మ రాష్ట్రం కోసం కొత్త జెండాను రూపొందించారు. దేశానికి జాతీయ ప‌తాకం ఉంది క‌దా? అంటే.. రాష్ట్రాల‌కు వేరుగా  జెండా ఉండ‌కూడ‌ద‌ని రాజ్యాంగంలో ఎక్క‌డా లేదు క‌దా? అంటూ ఎదురు ప్ర‌శ్నిస్తున్నారు. త‌మ రాష్ట్ర జెండా.. జాతీయ జెండా కంటే దిగువ‌నే ఉంటుంద‌ని ఆయ‌న చెబుతున్నారు.

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌లు ఎన్నిక‌లు ముంగిట్లోకి వ‌చ్చేసిన వేళ‌.. ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య ప్ర‌త్యేకండా జెండాను ఏర్పాటు చేయ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ప్రాంతీయ అభిమానం ఎక్కువ‌గా ఉండే క‌న్న‌డిగుల కోసం సీఎం సిద్ద‌రామ‌య్య కొత్త జెండాను ఏర్పాటు చేయ‌టం.. అది కూడా ఎన్నిక‌ల వేళలో చూస్తే.. ప్రాంతీయ భావ‌న‌ల్ని మ‌రింత పెంచేందుకేన‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

దీనికి త‌గ్గ‌ట్లే.. ఈ అంశం మీద మాట్లాడిన సిద్ధ‌రామ‌య్య‌.. రాష్ట్రానికి ప్ర‌త్యేక జెండా ఉండాల‌న్న‌ది క‌న్న‌డిగుల అభిప్రాయం.. ఆకాంక్ష‌గా వెల్ల‌డించారు. ప‌సుపు.. తెలుపు.. ఎరుపు వ‌ర్ణాల‌తో పాటు మ‌ధ్య‌లో రాష్ట్ర చిహ్న‌మైన గండ‌భేరుండ ఉంది. రాష్ట్ర జెండాను ఈ రోజు (శుక్ర‌వారం) కేబినెట్ ఆమోదించి అనంత‌రం కేంద్రానికి పంప‌నున్నారు. జాతీయ జెండా అత్యున్న‌త‌మేన‌ని చెబుతూ.. మ‌రోవైపు రాష్ట్ర జెండాను ప్ర‌త్యేకంగా త‌యారు చేయించ‌టం గ‌మ‌నార్హం.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English