భారత్ టెకీలకు జపాన్ శుభవార్త

భారత్ టెకీలకు జపాన్ శుభవార్త

అమెరికా హెచ్1బీ వీసాలను పొందడానికి నిబంధనలు కఠినతరం చేయడంతో పాటు వాటి సంఖ్యను తగ్గిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొద్ది రోజుల క్రితం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో చాలామంది అమెరికాలో ఉద్యోగాలు చేయడానికి వెళ్లాలనుకునే వారికి నిరాశే ఎదురైంది.

మ‌రోవైపు ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న మార్పుల కారణంగా గత కొన్నేళ్ల నుంచి భారత్‌లో ఐటీ ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ తగ్గుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఇలా ఇటీవ‌ల దుర్వార్త‌ల‌కు వేదిక‌గా మారిన ఐటీ రంగం నుంచి అనూహ్య తీపిక‌బురు ద‌క్కింది.ఐటీ ఉద్యోగంలో రాణించాలనుకునే గ్రాడ్యుయేట్లు, ఏదైనా సంస్థ నుంచి తొలగించబడిన, విదేశాల్లో స్థిరపడాలనుకునే ఐటీ నిపుణులకు శుభవార్త. తాజాగా జపాన్ నిర్ణయంతో ప్రతిభగల భారత ఐటీ నిపుణులకు ఊరట లభించనుంది.

భారతదేశం నుంచి దాదాపు 2లక్షల మంది ఐటీ నిపుణులకు జపాన్ తలుపులు తెరుస్తోంది. ఇక్కడ స్థిరపడటానికి గ్రీన్ కార్డులు ఇవ్వడంతోపాటు, అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ మౌలికవసతులకు సాయం అందించడానికి జపాన్ సిద్ధంగా ఉన్నట్లు జపాన్ ఎక్స్‌టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్(జేఈటీర్‌వో) ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ షిజెకీ మైద తెలిపారు. ప్రత్యేకంగా లైఫ్ సైన్సెస్, ఫైనాన్స్, సర్వీసెస్, అగ్రీకల్చర్ రంగాల్లో అత్యంత నైపుణ్యంగల నిపుణులను నియమించుకునేందుకు జపాన్ ఆసక్తి చూపిస్తోంది.

ఒక ఏడాది వ్యవధిలో శాశ్వత నివాస హోదా పొందడానికి ఎంపికైన ఉద్యోగులకు గ్రీన్‌కార్డ్ కూడా ఇచ్చేందుకు సహకరిస్తామని చెబుతోంది. సొ త్వ‌ర‌లో మ‌రో దేశం మ‌న టెకీల‌కు స్వ‌ర్గ‌దామంగా మార‌నుంద‌న్న‌మాట‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు