రియల్ ఫీలింగ్ రావట్లేదు పవన్

రియల్ ఫీలింగ్ రావట్లేదు పవన్

మూడ్రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ఫోటోలు దిగుతున్నాడనే న్యూస్ వచ్చిన సంగతి తెలిసిందే. పాతిక సినిమాలు చేసి.. ఇప్పుడు ఫోటోలు దిగడం ఏంటా అనుకున్నారు కానీ.. ఇది పొలిటికల్ లీడర్ గా దిగుతున్న ఫోటోలు అనే విషయం కాస్త ఆలస్యంగా బైటకు వచ్చింది. ఇప్పుడు ఆ ఫోటోలు కూడా బైటకు వచ్చాయి.

ఖద్దరు దుస్తుల్లో పవన్ కళ్యాణ్ సూపర్ గా ఉన్నాడు. అసలు సిసలైన రాజకీయ నాయకుడిని తనలో చూపించాలనే ప్రయత్నం బాగానే వర్కవుట్ అయిందని చెప్పవచ్చు. అయితే.. అసలు సమస్య ఏంటంటే.. ఈ ఫోటోల ద్వారా జనసేన అధినేతగా పవన్ ను చూపాలన్నది టార్గెట్. కానీ ఈ ఫోటోల్లో కూడా పవర్ స్టార్ గానే పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే.. పొలిటికల్ లీడర్ పాత్రను పవర్ స్టార్ పోషిస్తే ఎలా ఉంటుందో.. ఆ పోస్టర్ ను చూస్తే ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో.. ఇప్పుడు పవన్ దిగిన పొలిటికల్ ఫోటోలు కూడా అదే తరహాగా ఉన్నాయి. అంతే తప్ప.. రియల్ గా రాజకీయ నాయకుడిని చూసిన ఫీలింగ్ మాత్రం రావడం లేదన్నది చూపరుల వెర్షన్.

గతంలో జల్సా సినిమాలో కొన్ని సెకన్ల షాట్ కోసం పవన్ కళ్యాణ్ ఇలాగే ఖద్దరు ధరించి కనిపిస్తాడు. అక్కడ ఫన్నీ సీన్ కావడంతో బాగానే వర్కవుట్ అయిపోయింది. కానీ ఇక్కడ రియల్ పాలిటిక్స్ కదా.. మరి పవన్ కళ్యాణ్ ఫోటోలు ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English