అమెరికాలో మ‌ళ్లీ సంక్షోభం..గేట్స్ ఆందోళ‌న‌

అమెరికాలో మ‌ళ్లీ సంక్షోభం..గేట్స్ ఆందోళ‌న‌

అగ్రరాజ్యం అమెరికాను మరోసారి ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టనుందా?   దాదాపుగా ప‌దేళ్ల క్రితం ప్ర‌పంచాన్ని కుదిపేసిన సంక్షోభం లాంటిదే మ‌ళ్లీ చోటుచేసుకోనుందా? అంటే అవుననే అంటున్నాయి పారిశ్రామిక వర్గాలు. 2008లో వచ్చిన సంక్షోభం లాంటిదే మళ్లీ తలెత్తే అవకాశాలున్నాయని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ తెలిపారు.

ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో నన్నేమైనా అడగండి..సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించిన బిల్‌గేట్స్‌కు..2008లో వచ్చిన ఆర్థిక సంక్షోభం లాంటిది సమీప భవిష్యత్తులో తలెత్తే అవకాశం ఉన్నదా? అని వినియోగదారుడు ప్రశ్నించగా..`అవును అని చెప్పడం కష్టమే అయినప్పటికీ సంక్షోభం తలెత్తడం తథ్యం` అని బిల్‌గేట్స్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

కాగా, ఈ వ్యాఖ్యలను ప్రముఖ పెట్టుబడిదారు వారెన్ బఫెట్ కొట్టిపారేశారు. జోస్యం చెప్పడం కష్టతరమైనప్పటికీ ఇన్నోవేషన్, క్యాపిటలిజం మరింత మెరుగైతేనే ప్రస్తుతం ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కే అవకాశం ఉంటుందన్నారు. 2008లో వచ్చిన సంక్షోభంతో 88 లక్షల మంది అమెరికన్లు తమ ఉపాధి కోల్పోయారు.

దీంతోపాటు 19 లక్షల కోట్ల డాలర్ల సంపద నష్టపోగా, గృహాలు లేనివారి సంఖ్య గణనీయంగా పెరిగారు. ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని తగ్గించడానికి బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు