జ‌గ‌న్‌...ఈ సారి ఏం చేస్తారో అంటున్న టీడీపీ

జ‌గ‌న్‌...ఈ సారి ఏం చేస్తారో అంటున్న టీడీపీ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి నిర్ణ‌యం కోసం ఇటు సొంత పార్టీ నేత‌లు, అటు అధికార పార్టీ నాయ‌కులు ఒకింత ఉత్కంఠ‌తో ఎదురుచూస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. పాద‌యాత్ర‌ను 100 రోజుల పాటు విజ‌య‌వంతంగా పూర్తి చేసిన వైఎస్ జ‌గ‌న్‌ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల నేప‌థ్యంలో ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో అనే ఉత్కంఠ మొద‌లైంది. మార్చి 5 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ హాజ‌రుకానుందా లేదా అనేది రాజ‌కీయ‌వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

తెలుగుదేశం పార్టీ అప్ర‌జాస్వామికంగా చేప‌ట్టిన ఫిరాయింపుల‌పై వైసీపీ పోరాటం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌మ పార్టీ త‌ర‌ఫున గెలిచి టీడీపీలో చేరిన 23 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడంలేదని ఆగ్రహంగా ఉన్న వైసీపీ గత అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల‌పై ఆన‌ర్హత వేటు వేయడంతోపాటు నలుగురు మంత్రులను కూడా తొలగించాలని డిమాండ్‌ చేస్తోంది. అయితే ప్రభుత్వం నుంచి కాని.. స్పీకర్‌ నుంచి కాని స్పందన రాకపోవడంతో అసెంబ్లీ బాయ్ కాట్ నిర్ణ‌యం తీసుకుంది.

అయితే ఈసారి బడ్జెట్‌ సమావేశాలను కూడా బాయ్‌కాట్‌ చేస్తాయాలని వైసీపీ అధినాయకత్వం డిసైడైనట్టు ప్రచారం జ‌రుగుతోంది. అయితే వైసీపీ నిర్ణ‌యంపై ఇంకా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఎపీకి ప్రత్యేక హోదా కోసం ఉధృతంగా పోరు సాగుతోంది. చివరికి సీఎం చంద్రబాబు కూడా ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్‌ మాండును వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే బడ్జెట్‌ సమావేశాల్లో ప్రత్యేక హోదాపై చర్చించే అవకాశం ఉంది. ఇపుడు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలా అనే చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే తాము ప్ర‌త్యేకంగా హోదా పోరాటాన్ని ముందుకు తీసుకుపోతున్న నేప‌థ్యంలో అసెంబ్లీలోకి హాజ‌ర‌వాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. స్థూలంగా వైసీపీ నిర్ణ‌యంపై ఇటు అధికార ప‌క్షం అటు స్వ‌ప‌క్షంఎదురు చూస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు