అమ్మ విగ్ర‌హం అలా చేసింది తెలుగోడే! మార్చేస్తార‌ట‌!

అమ్మ విగ్ర‌హం అలా చేసింది తెలుగోడే! మార్చేస్తార‌ట‌!

తమిళనాడులో కొత్త క‌ల‌క‌లం మొద‌లైంది. 2016 డిసెంబర్‌లో మాజీ సీఎం జయలలిత కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత శనివారం 70వ పుట్టిన రోజు సందర్భంగా అమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే, దివంగత ముఖ్యమంత్రి జయలలిత కాంస్య విగ్రహంపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు అమ్మ అభిమానులు ఆ విగ్రహాన్ని చూసి షాకయ్యారు. తాజాగా ఆవిష్కరించిన కాంస్య విగ్రహంపై నెట్‌జన్లు ఫైర్ అవుతున్నారు. విగ్రహంలో ఉన్న ముఖం.. జయలలిత ముఖంలా లేదని విమర్శలు చేశారు.

స్థానిక‌ శిల్పకారుణ్ని కాకుండా, ఆంధప్రదేశ్ శిల్పకారుడితో విగ్రహాన్ని తయారు చేయించడం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం అవుతోంద‌ని స‌మాచారం. అయితే కాంస్యంతో చేసిన విగ్రహం కాబట్టి, కేవలం ముఖాన్ని మాత్రమే మార్చడం వీలుకాదని కొందరు అభిప్రాయపడుతున్నారు.  విగ్రహం కోసం ఎంత ఖర్చు చేశారన్న విషయాన్ని అన్నాడీఎంకే పార్టీ ఇంకా వెల్లడించలేదు. కానీ ఆ రాష్ట్ర మంత్రి పాండియరాజన్ ఈ అంశంపై స్పందించారు. విగ్రహంలోని ముఖానికి కావాల్సిన మార్పులు చేసి, మళ్లీ విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని ఆయన తెలిపారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English