ప్రకాశ్ రాజ్‌ ఒక్క రూపాయికే పరువు నష్టం దావా

ప్రకాశ్ రాజ్‌ ఒక్క రూపాయికే పరువు నష్టం దావా

ప్రధాని మోదీని నిత్యం అన్ని రకాలుగా విమర్శించే ప్రకాశ్ రాజ్ ఆయనపై ఎవరైనా విమర్శలు చేస్తే మాత్రం తట్టుకోలేకపోతున్నారు. తనపై విమర్శలు చేసిన బీజేపీ ఎంపీపై పరువు నష్టం దావా వేశారాయన.

మైసూరు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా ఇటీవల ప్రకాశ్ రాజ్‌పై విమర్శలు చేశారు. దీంతో ఆయన తన పరువుకు నష్టం కలిగించారంటూ ప్రకాశ్ రాజ్ మైసూరు సిటీ కోర్టులో దావా వేశారు. సోషల్ మీడియా వేదికగా ఈ వ్యాఖ్యలు చేసిన ప్రతాప్ సింహాపై ఒకే ఒక్క రూపాయికి పరువు నష్టం దావా వేసినట్టు మీడియాకు ప్రకాశ్ రాజ్ తెలిపారు. అయితే, ఒక్క రూపాయికే పరువు నష్టం దావా ఎందుకు వేశారనే విలేకరుల ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, కేవలం డబ్బు కోసం ఆయనపై దావా వేయలేదని, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి వ్యక్తిగత ప్రయోజనాల కోసం సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేసే వాళ్లకు గుణపాఠం చెప్పేందుకే ఈ దావా వేసినట్టు ప్రకాశ్ రాజ్ చెప్పారు. ఈ కేసు మార్చి 3వ తేదీకి వాయిదా వేసినట్టు ప్రకాశ్ రాజ్ తరపు న్యాయవాది మహదేవస్వామి పేర్కొన్నారు.

ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీపై  ప్రకాశ్ రాజ్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ కుటుంబ విషయాలను ప్రస్తావిస్తూ సామాజిక మాధ్యమాల వేదికగా ప్రతాప్ సింగ్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తన పరువుకు నష్టం కలిగించేలా ఉన్నాయని ఆరోపిస్తూ ప్రకాశ్ రాజ్ కోర్టును ఆశ్రయించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు