స్విట్జ‌ర్లాండ్ మంత్రి బాబుకు ఎందుకు సారీ చెప్పారు?

 స్విట్జ‌ర్లాండ్ మంత్రి బాబుకు ఎందుకు సారీ చెప్పారు?

భ‌విష్య‌త్తు ఊహించ‌గ‌లిగిన వారు అడుగులు చాలా జాగ్ర‌త్త‌గా వేస్తారు. ప్ర‌ణాళిక‌లు ప‌క్కాగా గీస్తారు. కానీ అవి చుట్టూ ఉన్న వారికి అవాస్త‌వాలుగా, భ్ర‌మ‌లుగా అనిపిస్తాయి. అందులో త‌ప్పులేదు. కానీ దానిని చూసి గేలి చేస్తే త‌రువాత త‌లదించుకోవాల్సి వ‌స్తుంది. ఈ విష‌యంలో ఆనాటి ఉమ్మ‌డి ఏపీ ముఖ్య‌మంత్రి  చంద్ర‌బాబు విష‌యంలో ఒక స్విట్జ‌ర్లాండ్ మంత్రికి ఎదురైంది. త‌రువాత ఆయ‌న త‌ప్పు తెలుసుకుని లెంపలేసుకోవాల్సి వ‌చ్చింది. ఈ విష‌యం గురించి తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో చంద్ర‌బాబు వివ‌రించారు.

బాబు ఏమన్నారంటే... *నేను గతంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజన్‌ 2020 పత్రం తయారు చేశాను. దానిని చాలా మంది కొట్టిపారేశార‌. కొంద‌రు ఎగతాళి చేశారు. స్విట్జర్‌లాండ్ దేశ‌పు మంత్రి  ఒక‌రి విజ‌న్ -2020 ప్లాన్‌ను విని *ఇలాంటి వారిని మా దేశంలో పిచ్చి ఆస్పత్రుల్లో పెడతాం* అని అన్నారు. ఆ తర్వాత కొన్నేళ్ల‌కు ఏపీ పేరు, హైదరాబాద్ పురోగ‌తి ప్ర‌పంచ మీడియాలో చూసి తెలుసుకున్నాక ఆయ‌న స్వ‌యంగా నాకు క్షమాపణ చెప్పారు. త‌న తప్పు అంగీకరించారు.. అన్నారు. సింగపూర్‌, మలేసియా ప్రధానమంత్రులు కూడా బాబు విజ‌న్ ప్లాన్‌ను చూసి మీ దేశ ప‌రిస్థితుల‌ను ఈ ప్లాన్ విన్నాక మీరు మరీ ఆశావాదిగా ఉన్నావే అని బాబుతో అన్నార‌ట‌. అయితే వారు కూడా అనంత‌రం జ‌రిగిన అభివృద్ధిని త‌మ అభిప్రాయాన్ని మార్చుకున్నార‌ని బాబు వెల్లడించారు.  

అంతేకాదు... బాబుకు ఒక పెద్ద అభిమాని ఉన్నారు. ఆయ‌న ఎవ‌రో సామాన్యుడు కాదు. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా చేసిన‌ ఉల్ఫెన్‌సన్‌. ఆయ‌న ఇండియా ప‌ర్య‌ట‌న‌లో బాబుతో మాట్లాడుతూ ‘నేను నీ అభిమానిని.. బాగా చేస్తున్నావ్‌’ అని కొనియాడారట‌.  ప్రపంచమంతా ప‌లు ప‌ర్య‌ట‌న‌ల్లో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు ప‌లుమార్లు చేశార‌ట‌.  

తాజాగా ఇప్ప‌టి ఏపీకి కూడా కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నాం అని  చంద్ర‌బాబు వివ‌రించారు. ఇప్పుడు ప‌లు పరిశ్రమలు తెస్తున్నాం. సేవల రంగం అభివృద్ధి చెందుతుంది. ప్రతి రంగంలో సాంకేతిక నైపుణ్యాన్ని జోడిస్తున్నాం. అలెక్సా వంటి సాఫ్ట్‌వేర్‌లు వాడుకోబోతున్నాం. వీటితో ఏ పని కావాలన్నా చేసుకోవచ్చు. కరెంటు పోయినా, పింఛను రాకపోయినా కారణం తెలుసుక‌నే వెసులుబాటు ఉంటుంది. అంత‌టి విస్తృత‌మైన ఉప‌యోగాలున్న వాటిపై దృష్టిసారిస్తున్నాం అని చంద్ర‌బాబు వెల్ల‌డించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు