ఆర్థిక నేరగాళ్ల ఆస్తులపై మోదీ కన్ను

ఆర్థిక నేరగాళ్ల ఆస్తులపై మోదీ కన్ను

ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పలాయనం చిత్తగించే బడాబాబులకు చెక్ పెట్టేందుకు మోదీ ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేయనున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక నేరగాళ్లకు వ్యతిరేకంగా  ''ది ఫ్యుజిటివ్‌ ఎకనామిక్‌ అఫెండర్స్‌ బిల్లు-2017''ను అమలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.  పేరుతో కొత్త చట్టాన్ని త్వరలో తేనుంది.

గత సెప్టెంబర్‌లోనే కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఈ బిల్లును  ఆమోదించింది. పీఎన్‌బీ స్కాం నేపథ్యంలో ఈ బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేయాలని మోదీ ప్రభుత్వం చూస్తోంది. మార్చి 6 నుంచి జరుగబోతున్న తదుపరి బడ్జెట్‌ సెషన్లలో దీన్ని ఆమోదించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఒక్కసారి ఈ బిల్లు ఆమోదిస్తే... దర్యాప్తు సంస్థ విదేశాలకు పారిపోయిన రుణ ఎగవేతదారులు, బ్యాంకులకు మోసాలకు పాల్పడిన ఆర్థిక నేరగాళ్ల ఆస్తులను ఎలాంటి దాడులు చేయకుండానే స్వాధీనం చేసుకోవచ్చు.

రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా, ఫైనాన్సియల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ కూడా ఈ చర్యలను అమలు చేయాల్సి ఉంటుంది. అసాధారణ లావాదేవీలను గుర్తించి, అథారిటీలకు అలర్ట్‌ చేయాల్సిన బాధ్యత కూడా బ్యాంకింగ్‌ రెగ్యులేటర్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీమ్‌దే. ఎగవేత కంపెనీల వ్యాపార నమూనాల మార్పులపై ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీలు ఎప్పటికప్పుడు దృష్టిసారించాలి. అంతేకాక ఎగవేత కంపెనీ ప్రమోటర్లపై చర్యలు మాత్రమే కాక, వారి విదేశీ ప్రయాణాలను నిలువరించేలా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.     

ఈ బిల్లు పాసయ్యాక నీరవ్ మోదీ, విజయ్ మాల్యా సహా ఇతర ఆర్థిక నేరగాళ్ల ఆస్తులను స్పెషల్‌ కోర్టు ద్వారా రికవరీ చేసుకునే అవకాశం ఉంటుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు