అమిత్‌షాను అవాక్క‌య్యేలా చేశారు

అమిత్‌షాను అవాక్క‌య్యేలా చేశారు

పొరుగు రాష్ట్రమైన కర్నాటకలో ఎన్నిక‌ల వేడి జోరందుకుంది. ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర పర్యటనలో ఉన్న జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌షాకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. ఆత్మహత్యలు చేసుకున్న పలు రైతు కుటుంబాలను పరామర్శించడంతో పాటు, హుమ్మాబాద్‌ని కలబురగిలో రైతులతో ఓ సమావేశాన్ని నిర్వహించారు. ఇది ఇంటరాక్టివ్‌ భేటీ అని... రైతులడిగే ప్రశ్నలకు అమిత్‌షా సమాధానం చెబుతారని ప్రచారం చేశారు. దాదాపు వెయ్యి మంది సమావేశానికి హాజరుకాగా, కేవలం ఐదుగురికి మాత్రమే ప్రశ్నలడిగేందుకు అనుమతిచ్చారు. వారడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అమిషాకు ఒక‌ద‌శ‌లో ఇబ్బంది ప‌డ్డారు. కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే దాటవేసే ప్రయత్నం చేశారు.

రైతుల‌తో ముఖాముఖిలో భాగంగా వ్యవసాయ సంక్షోభం, దానిని పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వ పాత్రకు సంబంధించిన ప్రత్యక్ష ప్రశ్నలను ఆ సమావేశంలో రైతు నాయకులు అమిత్‌షాకు సంధించారు. ''రూ. 17,15,000 కోట్ల కార్పొరేట్‌ రుణాలను మాఫీ చేయడానికి మీ వద్ద తగిన నగదు ఉంది. కానీ, 12,60,000 కోట్ల రైతు రుణాలను మాఫీ చేసేందుకు మాత్రం మీ దగ్గర నిధులులేవు. మిమ్మల్ని అధికార పీఠం ఎక్కించింది పారిశ్రామికవేత్తలు మాత్రమే కాదని మీరు తెలుసుకోవాలి'' అని అమిషాత్‌ను రైతు నాయకుడు సిద్ధరామప్ప ప్రశించారు.

దీంతో కార్పొరేట్‌ రుణాల రద్దుపై అమిత్‌షా వివరణ ఇచ్చారు. ''కార్పొరేట్‌ రుణాలను కేంద్ర ప్రభుత్వం మాఫీ చేసిందని కాంగ్రెస్‌ అధ్యక్షులు రాహుల్‌ గాంధీ చెబుతున్నారు. మేం ఏ కార్పొరేట్‌ రుణాన్ని రద్దుచేయలేదు. పారిశ్రామికవేత్తలకు సహాయం చేసేందుకు పన్ను రేట్లను తగ్గించాం' అని అమిత్‌షా అన్నారు.

అయితే రుణమాఫీ చేయాలన్న రైతుల డిమాండ్‌పై మాత్రం అమిత్ షా స్పందించలేదు. 'ప్రతి పంటకు ఉత్పత్తి ఖర్చుకు ఒకటిన్నర రెట్లు కనీసమద్దతు ధర కల్పిస్తామన్నారు... ఎంఎస్‌ స్వామినాథన్‌ సిఫారసులను అమలుచేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాన్ని ఎందుకు అమలుచేయడంలేదు.?' అని మరో రైతు నేత ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానాన్ని ఇవ్వకుండా షా దాటవేశారు. దీంతో ప‌లువురు రైతులు మీడియాతో మాట్లాడుతూ త‌మ రుణాల విష‌యంలో బీజేపీ స‌ర్కారు స్ప‌ష్ట‌త‌తో లేద‌ని అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు