బోనీ.. నాలుగ్గంటల విచారణ.. అంతా బుస్

బోనీ.. నాలుగ్గంటల విచారణ.. అంతా బుస్

శ్రీదేవి మరణంలో కుట్ర ఉందట.. బోనీ కపూర్ తీరు అనుమానాస్పదంగా ఉందట.. ఆయన్ని దుబాయ్ పోలీసులు నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా విచారించారట.. ఆయన పాస్ పోర్టును కూడా సీజ్ చేశారట.. నిన్న అంతటా మీడియాలో ఎక్కడ చూసినా ఇదే చర్చ. కొన్ని టీవీ ఛానెళ్లయితే మరీ శ్రుతి మించి పోయి.. శ్రీదేవి మరణానికి బోనీనే కారణం అంటూ తీర్మానించేశాయి.

ఒక దుబాయ్ పత్రిక కథనాన్ని పట్టుకుని మనోళ్లు వలువలు చిలువలు చేసి వార్తలు పులిమేశారు. కానీ శ్రీదేవి మరణంలో బోనీ పాత్ర ఏమీ లేదని.. ఈ విషయంలో దుబాయ్ పోలీసులకు సందేహాలు కూడా ఏమీ లేవని స్పష్టమైంది.

బోనీ గురించి వచ్చిన రూమర్లన్నింటినీ దుబాయ్ పోలీసులు ఖండిస్తూ ఈ రోజు ఒక ప్రకటన ఇచ్చారు. బోనీని తాము విచారించామని వస్తున్న వార్తల్ని వాళ్లు ఖండించారు. కేవలం బోనీ నుంచి స్టేట్మెంట్ మాత్రమే తీసుకున్నామని.. విచారణ వార్తలు అబద్ధమని వాళ్లు స్పష్టం చేశారు. శ్రీదేవి ఎప్పుడు చనిపోయిందనే విషయంలో నెలకొన్న సందిగ్ధతకు కూడా దుబాయ్ పోలీసులు తెర దించారు.

దుబాయ్ కాలమానం ప్రకారం శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో శ్రీదేవి చనిపోయిందని.. ఆదివారం ఉదయం బోనీ స్టేట్మెంట్ రికార్డు చేశామని వారు వెళ్లడించారు. శ్రీదేవి పార్థివ దేహం పాడవకుండా ఈ రోజు మధ్యాహ్నం ఎంబాడింగ్ చేసి.. సాయంత్రం లోపు మిగతా ప్రక్రియ అంతా పూర్తి చేసి, విచారణను ఒక కొలిక్కి తెచ్చి ఈ రోజు రాత్రికి దేహాన్ని ఇండియాకు పంపే అవకాశాలున్నాయని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు