ఎంత చట్టాలైనా ఇంత లేటా?

ఎంత చట్టాలైనా ఇంత లేటా?

అందాల తార శ్రీదేవి అకాల మరణాన్ని ఇంకా మన వాళ్లు ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె మృతి ప్రతీ ఒక్కరినీ కన్నీటి పర్యంతం చేసేసింది. అయితే, శ్రీదేవి మృతి చెంది 36 గంటలు దాటిపోయినా.. ఇంకా ఆమె భౌతిక దేహాన్ని ఇండియాకు ఎప్పుడు తీసుకువస్తారనే విషయంపై స్పష్టత రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

అయితే ఈ లోగా అనుమానాస్పద మృతి కోణంలో కథనాలు కూడా వచ్చేస్తున్నాయి. ఇందుకు కారణం ఆమె భౌతిక దేహాన్ని భారత్ కు తరలించేందుకు దుబాయ్ అధికారుల నుంచి అనుమతులు రాకపోవడమే. ఆ దేశపు చట్టాల కారణంగానే ఇంతగా ఆలస్యం అవుతోంది. ఎవరైనా మరణిస్తే అక్కడ వెంటనే కచ్చితంగా పోలీసులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తారు. ఆస్పత్రి వర్గాలు అటాప్సీతో పాటే రక్త పరీక్షలను కూడా చేస్తారు. శ్రీదేవి మృతి హార్ట్ ఎటాక్ కారణంగానే అని ఆస్పత్రి వర్గాలు ధృవీకరించినా.. ఇంకా ఆమె బాడీ అప్పగించలేదు. ఇందుకు కారణం.. ఇంకా బ్లడ్ రిపోర్టులు రాకపోవడేనట.

మరోవైపు విదేశాలకు కనుక తరలించాల్సి ఉంటే.. ముందుగా ఆ దేశపు కార్యాలయానికి పోలీసులు నివేదిస్తారు. పాస్ పోర్ట్ రద్దు చేసిన అనంతరం మాత్రమే.. డెత్ సర్టిఫికేట్ జారీ అవుతుంది. అది లేకుండా బాడీ తరలించడం సాధ్యం కాదు. ఇదంతా ముందుగా నిర్ణయించిన వ్యవస్తీకరించిన రీతిలోనే సాగుతున్నా.. శ్రీదేవి లాంటి సెలబ్రిటీ మృతి చెందినపుడు కూడా ఏ మాత్రం వేగం లేకుండా.. అభిమానులను నిస్పృహలో నింపేస్తున్న తీరు మాత్రం విమర్శలకు గురవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు