ఎంత మంది మిగులుతారో మరి?

ఎంత మంది మిగులుతారో మరి?

పిసిసి అద్యక్షుడు, మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపణలు ఎదుర్కుంటున్న మంత్రులంతా రాజీనామా చేయవలసిందేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్నమొన్నటి వరకు 'తెరచాటు వ్యవహారాల్లో' తమకు సంబంధం లేదని, వైఎస్‌ హయూంలో అక్రమాలు జరిగినా, దాంట్లో మంత్రుల తప్పు లేదని చెబుతూ వచ్చిన బొత్స ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు రాజీనామా చేయాలనడం ఆశ్చర్యంగానే ఉంది.

అదిష్టానం నిర్ణయానుసారం బొత్స మాట్లాడారని అనుకోవాలా? అన్నది కూడా సందేహమే. ఆరోపణలు వచ్చినవారంతా రాజీనామా చేస్తే ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఇరుకున పడ్తారన్నది బొత్స వ్యూహమని కూడా అంటున్నారు. బొత్స సంచలన వ్యాఖ్యలు ఇక్కడితో ఆగలేదు.

పార్టీని వదలి వెళుతున్న టి.కాంగ్రెస్‌ ఎమ్‌.పిలను ఉద్దేశించి మాట్లాడుతూ పోయేవారిని పట్టుకుని వేలాడుతామా అని కూడా బొత్స అన్నారు. పార్టీ వదిలి వెళ్ళేవారిని బుజ్జగించడం ఏ పార్టీ అయినా చేసే పనే. కాని బొత్స దానికి విరుద్ధంగా మాట్లాడారు. పత్రికల మీద కూడా బొత్స అసహనం ప్రదర్శించారు. పత్రికలు ఎవరి ఎజెండా ప్రకారం రాస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు