రాష్ట్రప‌తి.. ప్ర‌ధాని స‌హా అంతా రియాక్ట్ అయ్యారు

రాష్ట్రప‌తి.. ప్ర‌ధాని స‌హా అంతా రియాక్ట్ అయ్యారు

సినీన‌టి.. అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి హ‌ఠాన్మ‌ర‌ణం దేశాన్ని కుదిపేసింది. చాలా త‌క్కువ సంద‌ర్భాల్లో మాత్రమే యావ‌త్ దేశం శోక‌సంద్రంలో కూరుకుపోతుంది. అలాంటి అరుదైన ఆవేద‌న ఇప్పుడు దేశాన్ని వెంటాడుతోంది. శ్రీ‌దేవి మ‌ర‌ణ‌వార్త ఇప్పుడో సంచ‌ల‌నంగా మార‌ట‌మే కాదు.. కోట్లాది మంది గుండెల్ని పిండేస్తోంది.

భార‌త రాష్ట్రప‌తి.. దేశ ప్ర‌ధాని మొద‌లు సామాన్యుడు వ‌ర‌కూ అంద‌రూ శ్రీ‌దేవి మ‌ర‌ణం గురించే మాట్లాడుకుంటున్న ప‌రిస్థితి. ఏ టీవీ ఛాన‌ల్ చూసినా.. సోష‌ల్ మీడియా చూసినా.. వెబ్ సైట్లు చూసినా ఆమె మ‌ర‌ణం గురించిన చ‌ర్చే జ‌రుగుతోంది. అతిలోక సుంద‌రిని తామెంత‌గా ఆరాధిస్తామ‌న్న విష‌యాన్ని ఎవ‌రికి వారు చెప్పుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

శ్రీ‌దేవి మ‌ర‌ణంపై రాష్ట్రప‌తి రామ్ నాథ్ కోవింద్‌.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ట్విట్ట‌ర్ లో సంతాపాన్ని వ్య‌క్తం చేశారు. శ్రీ‌దేవి మ‌ర‌ణ‌వార్త విని షాక్ కు గుర‌య్యా.. కోట్లాది మంది అభిమానుల గుండెలు బ‌ద్ధ‌లు కొట్టేసి ఆమె వెళ్లిపోయారు. ముంద్ర‌మ్ పిరై.. ల‌మ్హే.. ఇంగ్లీష్ వింగ్లీష్ లాంటి చిత్రాలు ఎంద‌రికో ఆద‌ర్శంగా నిలిచాయి.. ఆమె కుటుంబ స‌భ్యుల‌కు నా ప్ర‌గాఢ సంతాపం తెలియ‌జేస్తున్నాన‌ని రాష్ట్రప‌తి పేర్కొంటే.. న‌టి శ్రీ‌దేవి మ‌ర‌ణం బాధాక‌రం.. చిర‌స్మ‌ర‌ణీయ పాత్ర‌ల‌తో అల‌రించిన దిగ్గ‌జ న‌టి.. ఆమె కుటుంబ స‌భ్యుల‌కు నా ప్ర‌గాఢ సంతాపం తెలియ‌జేస్తూ.. ఆమె ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుకుంటున్నా అంటూప్ర‌ధాని మోడీ ట్వీట్ చేశారు.

శ్రీ‌దేవి మ‌ర‌ణంపై సినీ..క్రీడా.. పారిశ్రామిక‌.. రాజ‌కీయ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు ప‌లువురు రియాక్ట్ అయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు సైతం శ్రీ‌దేవి మ‌ర‌ణంపై రియాక్ట్ అయి.. ఆమె కుటుంబానికి సంతాపాన్ని ప్ర‌క‌టించారు. ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ త‌న సంతాపాన్ని వ్య‌క్తం చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు