బాబు అడిగింది.. మోడీ ఇస్తాడా మ‌రి!

బాబు అడిగింది.. మోడీ ఇస్తాడా మ‌రి!

ఒక‌ప్పుడు హీరోగా చేసిన వెంకీ... తొలిప్రేమ సినిమాతో దర్శ‌కుడ‌య్యాడు. మామూలు ద‌ర్శ‌కుడు కాదు... మొద‌టి సినిమానే హిట్ కొట్టించిన ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు కోరి మ‌రీ సినిమాలు చేయ‌మ‌ని అడుగుతున్నారు టాలీవుడ్ టాప్ స్టార్లు. అలా ఓ కుర్ర‌హీరోతో సినిమా చేయ‌మంటూ వెంకీకి అవ‌కాశం వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

తొలిప్రేమ‌... ఓ సైలెంట్ హిట్‌. హాయిగా సాగిపోయే ప్రేమ‌క‌థ‌. ప్రేమ‌లోని గ‌మ్మ‌త్తుగ‌ను ప్రేక్ష‌కుల హృద‌యాల‌కు హ‌త్తుకునేలా తీశాడు వెంకీ. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను హీరోగా నిల‌బెట్టిన సినిమా తొలిప్రేమ‌. ఇప్ప‌టికీ ఆ సినిమా అంటే ప‌డిచ‌చ్చిపోయేవాళ్లు ఎంతో మంది. అలాంటి టైటిల్‌తో సినిమా తీయాలంటే చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యం చేసి వెంకీ అట్లూరి... విజ‌యం సాధించాడు. ఆ సినిమా చూశాక మెగా ఫ్యాన్సే కాదు... పెద్ద హీరోలు సైతం వాహ్వా అనుకున్నారు. వారిలో ఒక‌రు నాగార్జున కూడా. తెలిసిన స‌మాచారం మేర‌కు నాగ్ వెంకీ అట్లూరిని పిలిపించుకుని మాట్లాడాడ‌ట‌. అఖిల్‌ను పెట్టి మంచి సినిమా తీయ‌మ‌ని కోరిన‌ట్టు తెలుస్తోంది.

అఖిల్ కెరీర్లో చేసిన రెండు సినిమాలు ఫ్లాప‌య్యాయి. తొలిసినిమా అఖిల్ అస్స‌లు ఆడ‌లేదు. ఇక రెండో సినిమా హ‌లో ఫ‌ర్వాలేద‌నిపించినా... బాక్సాఫీసు ద‌గ్గ‌ర పెద్ద‌గా ఆడ‌లేదు. దీంతో అఖిల్ మీడియాకు దూరంగా ఉంటున్నాడు. సోష‌ల్ మీడియాలో కూడా పెద్ద‌గా యాక్టివ్‌గా లేడు. ఇప్పుడు అఖిల్ కు ఓ హిట్ చాలా అవ‌స‌రం. అందుకే మ‌రో మంచి ప్రేమ‌క‌థ‌లో అఖిల్ తో సినిమా చేయ‌మ‌ని వెంకీని అడిగిన‌ట్టు తెలుస్తోంది. అధికారికంగా ప్ర‌క‌టిస్తే కానీ... ఆ సినిమా చేస్తున్నాడో లేదు తెలియ‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English