ఓటుకు నోటుకు స్వ‌స్తి చెప్పండి....ప్ర‌జ‌ల‌కు క‌మ‌ల్ పిలుపు!

ఓటుకు నోటుకు స్వ‌స్తి చెప్పండి....ప్ర‌జ‌ల‌కు క‌మ‌ల్ పిలుపు!

భార‌త మాజీ రాష్ట్రపతి అబ్ధుల్ కలాం సమాధిని దర్శించుకొని ముధురై లోని బహిరంగ సభలో కమల్ తన కొత్తపార్టీ ‘మక్కల్ నీధి మయ్యం’ ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. త‌న పార్టీ లెఫ్ట్ , రైట్ ల‌కు మ‌ధ్య ఉంటుంద‌ని....అందుకే ప్రజా న్యాయ కేంద్రం (పీపుల్స్ జస్టిస్ సెంటర్) అని అర్థం వచ్చేలా తన పార్టీ పేరు పెట్టాన‌ని ఆయ‌న వెల్లడించారు. ఆ త‌ర్వాత త‌న‌ పార్టీ జెండాను ఆవిష్కరించిన క‌మ‌ల్ ఉద్వేగ‌భ‌రితంగా అభిమానుల‌నుద్దేశించి ప్ర‌సంగించారు. తాజాగా క‌మ‌ల్ ఈ రోజు తన పార్టీ విధివిధానాల‌ను వెల్ల‌డించారు. ఇప్పుడున్న‌ రాజకీయ వ్యవస్థ ప్రమాద కరంగా మారిపోయింద‌ని క‌మ‌ల్ మండిప‌డ్డారు. డ‌బ్బు తీసుకొని ఓటు వేయ‌డం....ప‌విత్ర‌మైన ప్రజాస్వామ్యాన్ని రాజకీయ నాయకుడికి అమ్మ‌డంతో స‌మాన‌మ‌న్నారు. ఆ ప‌ద్ధ‌తి మారాల‌ని క‌మ‌ల్ అభిప్రాయ‌ప‌డ్డారు. నేడు మీడియాతో మాట్లాడిన క‌మ‌ల్ అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు.


ఖద్దరు తొడిగిన‌వాడే నేత అనే భావ‌న‌లో జ‌నం ఉన్నార‌ని, వారిని మోటివేట్ చేయాల‌ని క‌మ‌ల్ అన్నారు. అన్నం పెట్టే రైతన్నని ప్ర‌స్తుత రాజ‌కీయ‌నేత‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, త‌మ‌కు ముద్ద దొరికితే చాలనే ధోర‌ణిలో రాజ‌కీయ నాయ‌కులున్నార‌ని మండిప‌డ్డారు. ప్రస్తుతం సమాజం మురికి కుంట‌లా ఉంద‌ని, అందులోని దుర్వాస‌న‌ను ప‌న్నీరు అనుకొని గొప్ప అని నేత‌లు చెప్పుకుంటున్నారని దుయ్య‌బ‌ట్టారు. రాజకీయ ప్ర‌క్షాళ‌న ప్ర‌జ‌ల బాధ్య‌త అని అన్నారు. ఈ కుళ్లు రాజకీయాలను మార్చేందుకు తాను రెడీ అని, త‌న‌కు ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు కావాల‌ని క‌మ‌ల్ కోరారు. మార్పు ఒక్క రోజులో...ఒక్క వ్య‌క్తితో రాద‌ని, స‌మ‌ష్టిగా అంద‌రం చేయి చేయి క‌లిపి ముందుకు వెళితేనే మార్పు సాధ్య‌మ‌ని చెప్పారు. అందుకే త‌న పార్టీ గుర్తు చేయి చేయిక‌లిపిన‌ట్లుగా ఉంటుంద‌ని తెలిపారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English