ఇండిగో.. ఇలా వేధిస్తే ఎలా..?

ఇండిగో.. ఇలా వేధిస్తే ఎలా..?

దేశీయంగా విజ‌య‌వంతంగా న‌డుస్తున్న ఇండిగో ఎయిర్ లైన్స్ త‌ర‌చూ ఏదో వివాదాల‌తో వార్త‌ల్లోకి ఎక్కుతున్న వైనం తెలిసిందే. తాజాగా మ‌రో వివాదంలోకి చిక్కుకుంది. టైమ్‌కి ఎయిర్ పోర్టుకు వ‌చ్చి ఫ్లైట్ వ‌ద్ద‌కు చేరుకున్నా టైంకి రాలేదంటూ విమానంలోకి అనుమ‌తించ‌ని వైనంపై ఒక ప్ర‌యాణికుడు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నాడు.

ఇండిగో సిబ్బంది దురుసు ప్ర‌వ‌ర్త‌న‌పై తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నాడు. త‌మ త‌ప్పు లేకున్నా ఇండిగో సిబ్బంది వ్య‌వ‌హ‌రించిన తీరును త‌ప్పుడుతున్నాడు. బాధితుడు చేసిన ఆరోప‌ణ ప్ర‌కారం హైద‌రాబాద్ నుంచి గోవాకు వెళ్లే 6ఈ-743 విమానం ఎక్క‌టానికి టైం కంటే ముందే ఎయిర్ పోర్ట్‌కు వ‌చ్చిన‌ట్లుగా పేర్కొన్నారు.

విమానం బ‌య‌లుదేర‌టానికి ఉద‌యం 5.40 గంట‌లకు టైంగా చెప్పార‌ని.. విమానం వ‌ద్ద‌కు చేరుకోవ‌టానికి కేటాయించిన స‌మ‌యానికి తాను చేరుకున్నా.. ఆల‌స్యంగా వ‌చ్చాన‌ని చెప్పి అడ్డుకున్నార‌ని ఆరోపించారు. తాను ఎక్కాల్సిన విమానం వ‌ద్ద‌కు చేరుకోవ‌టానికి ఎయిర్ లైన్స్ ఏర్పాటు చేసిన బ‌స్సు బ‌య‌లుదేరే స‌మ‌యానికి చేరుకోవ‌ట‌మే కాదు.. ఆ బ‌స్సులో ప్ర‌యాణించి విమానం వ‌ద్ద‌కు వెళ్లినా..త‌మ‌ను ఎక్కించుకోలేద‌న్నారు. విమానం వ‌ద్ద‌కు బ‌స్సులో 5.22 గంట‌ల‌కు చేరుకున్నా త‌న‌ను లోప‌ల‌కు అనుమ‌తించ‌లేద‌న్నారు. త‌న‌తో పాటు బ‌స్సులో మ‌రో మ‌హిళా.. పిల్లాడు కూడా ఉన్న‌ట్లు చెప్పాడు.

వీడియో సందేశంలో ఇండిగో తీరును త‌ప్పు ప‌ట్టిన బాధితుడు.. ఒక‌వేళ తాను స‌మ‌యానికి రాకుంటే.. త‌న‌ను విమానం వ‌ద్ద‌కు సంస్థ‌కు చెందిన బ‌స్సులో వెళ్ల‌టానికి ఎలా అనుమ‌తిస్తారు? అని సూటిగా ప్ర‌శ్నిస్తున్నారు. త‌ర‌చూ ఏదో ఒక వివాదంలోకి ఇండిగో ఎందుకు వెళుతున్న‌ట్లు?  ఈ విష‌యం మీద స‌ద‌రు సంస్థ ఆలోచిస్తే మంచిద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English