ఆయ‌న ఇంట్లోకి సీఎం దెయ్యం వ‌దిలార‌ట‌

ఆయ‌న ఇంట్లోకి సీఎం దెయ్యం వ‌దిలార‌ట‌

ఎంత ప్ర‌జాద‌ర‌ణ ఉన్నా.. మ‌రెంత పెద్ద హోదాలో ఉన్నా కొంద‌రు త‌మ‌కున్న న‌మ్మ‌కాల‌తో చిన్న‌పిల్లాడిలా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. తాజాగా ఆర్జేడీ అధినేత లాలూ కుమారుడు.. మాజీ మంత్రి తేజ్ ప్ర‌తాప్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడిలానే ఉన్నాయి. ఆయ‌న నోటి నుంచి వ‌స్తున్న మాట‌లు వింటుంటే.. కామెడీ కామెడీగా ఉన్నాయి.

న‌మ్మ‌కాల‌కు అమిత‌మైన ప్రాధాన్య‌త ఇచ్చే తేజ్ ప్ర‌తాప్.. ఇటీవ‌ల త‌న మంత్రి ప‌ద‌వి హుష్ కాకి అయ్యాక స‌ర్కారు త‌న‌కు కేటాయించిన ఇంటిని ఖాళీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. బిహార్ ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్‌.. ఆ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి సుశీల్ మోడీలు తానున్న ఇంట్లోకి దెయ్యాల్ని వ‌దిలార‌న్నారు. వాస్త‌వానికి ఆర్జేతో పొత్తు పెట్టుకున్న నితీశ్ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన‌ప్పుడు దేశ్ ర‌త్న్ మార్గ్ లోని భ‌వ‌నాన్ని తేజ్ కోసం కేటాయించారు.

ఆ బంగ్లాను త‌న సెంటిమెంట్ గా పీలైన తేజ్.. దానికి వాస్తుప‌రంగా చేయించాల్సిన మార్పులు భారీగా చేయించారు. చివ‌ర‌కు బంగ్లా మొయిన్ డోర్ ను మూసేసి మ‌రీ మార్పులు చేయించారు. అయితే.. రాజ‌కీయంగా చోటు చేసుకున్న మార్పుల‌తో ఆయ‌న మంత్రి ప‌ద‌వి ఊడింది. దీంతో.. అధికారిక భ‌వ‌నాన్ని ఖాళీ చేయాల్సి వ‌చ్చింది. అయితే.. త‌న‌కు సెంటిమెంట్ గా ఉన్న ఇంటిని విడిచి పెట్ట‌టానికి తోజో నో అంటే నో అనేశారు.

ఇదిలా ఉండ‌గా.. ఆ ఇంటిని ఖాళీ చేయాలంటూ అధికారులు నోటీసులు జారీ చేశారు. చివ‌ర‌కు తీవ్ర ఒత్తిడి తేవ‌టంతో బంగ్లాను ఖాళీ చేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో త‌న‌ను ఖాళీ చేయించిన బంగ్లా విష‌యంలో త‌న‌దైన శైలిలో రియాక్ట్ అయ్యారు. ముఖ్య‌మంత్రి.. ఉ ప‌ముఖ్య‌మంత్రి త‌న ఇంట్లోకి దెయ్యాన్ని విడిచార‌ని.. అందుకే తాను ఇంటిని ఖాళీ చేయాల్సి వ‌చ్చిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు చేసిన సంచ‌ల‌నం సృష్టించారు. దెయ్యాల పేరుతో జిమ్మిక్కు రాజ‌కీయాల్ని తేజ్ చేస్తున్న‌ట్లుగా ప‌లువురు మండిప‌డుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English