మంబ‌యిలో ఆ 4 ఫ్లాట్లు.. జ‌స్ట్ రూ.240 కోట్లేన‌ట‌

మంబ‌యిలో ఆ 4 ఫ్లాట్లు.. జ‌స్ట్ రూ.240 కోట్లేన‌ట‌

దేశంలో అత్యంత ఖ‌రీదైన లావాదేవీ ఒక‌టి న‌మోదైంది. కేవ‌లం నాలుగంటే నాలుగు ఫ్లాట్ల‌ను భారీ ధ‌ర‌కు అమ్మారు. ముంబ‌యిలోని అత్యంత సంప‌న్న ప్రాంత‌మైన నేపియ‌న్ సీ రోడ్డుకు స‌మీపంలో నాలుగు ఫ్లాట్ల‌ను రూ.240 కోట్ల‌కు కొనుగోలు చేసిన వైనం సంచ‌ల‌నంగా మారింది.

రున్వాల్ గ్రూప్ సిద్ధం చేస్తున్న ద రెసిడెన్స్ అపార్ట్ మెంట్లో 28..29..30..31 ఫ్లాట్ల‌ను ప్ర‌ముఖ వ్యాపార కుటుంబ‌మైన త‌పారియా ఫ్యామిలీ ఈ భారీ కొనుగోలు చేసిన‌ట్లుగా చెబుతున్నారు. చ‌ద‌ర‌పు అడుగు రూ.1.2ల‌క్ష‌ల చొప్పున కొనుగోలు చేయ‌టం గ‌మ‌నార్మం. ఒక్కో ఫ్లాట్ 4500 చ‌ద‌ర‌పు అడుగులుగా చెబుతున్నారు. ముంబ‌యి మ‌హాన‌గ‌రంలో అత్య‌ధిక ప‌న్నులు చెల్లిస్తున్న వారిలో త‌పారియా ఫ్యామిలీ ఒక‌టి.

గ‌ర్భ నిరోధ‌క మాత్ర‌లు త‌యారు చేసే ఫేమీ కేర్ కంపెనీ త‌పారియా ఫ్యామిలీ కింద‌నే ఒక‌ప్పుడు ఉండేది. మూడేళ్ల క్రితం ఆ కంపెనీని రూ.4600 కోట్లకు అమ్మేశారు. ఖ‌రీదైన ఇళ్ల‌ను కొనుగోలు చేయ‌టంలో త‌పారియా ఫ్యామిలీ ముందు ఉంటుంద‌న్న మాట ఉంది.

ఎందుకంటే.. రెండేళ్ల కింద‌ట ఇదే కుటుంబం బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో ఒక డ్యూఫ్లెక్స్ అపార్ట్ మెంట్ ఫ్లాట్ ను రూ.60 కోట్లతో కొనుగోలు చేసింద‌ని చెబుతారు. ఇక‌.. తాజాగా కొనుగోలు చేసిన నాలుగు ఫ్లాట్ల విష‌యానికి వ‌స్తే.. వీరికి ఏకంగా 28 కారు పార్కింగ్ స్లాట్లు కేటాయించిన‌ట్లుగా తెలుస్తోంది. ఏమైనా.. ఖ‌రీదైన భ‌వ‌నాల్ని కొనుగోలు చేయ‌టంలో త‌పారియా కుటుంబం ముందు ఉంటుంద‌న్నది మ‌రోసారి నిరూపిత‌మైంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English