ఓటుకునోటు ట్విస్ట్‌...సుప్రీంకు మ‌త్త‌య్య‌..కేటీఆర్ ఎంట్రీ

ఓటుకునోటు ట్విస్ట్‌...సుప్రీంకు మ‌త్త‌య్య‌..కేటీఆర్ ఎంట్రీ

తెలుగు రాష్ర్టాల్లోనే కాకుండా దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఓటుకునోటు కేసులో కీల‌క మ‌లుపు చోటుచేసుకుంది. ఓటుకు నోటు కేసులో ఏ4గా ఉన్న  జెరూసలేం మత్తయ్య సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. ఓటుకు నోటు కేసులో అప్రూవర్ గా మారుతున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి మ‌త్త‌య్య‌ లేఖ రాశారు. అప్రూవర్ గా మారుతున్నట్లు సర్వోన్నత న్యాయస్థానంలో  జెరూసలేం మత్తయ్య పిటిషన్ దాఖలు చేశారు. అనంత‌రం ఓ మీడియా సంస్థ‌తో మాట్లాడుతూ త‌న‌ను చంప‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని మ‌త్త‌య్య ఆరోపించారు.

ఈ సంద‌ర్భంగా త‌న అఫిడ‌విట్‌లో ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. `ఓటుకు నోటు కేసులో నాకు అసలు సంబంధం లేదు. నన్ను అటు టీడీపీ, ఇటు తెరాస ప్రభుత్వాలు వాడుకోవాలని చూశాయి. నేను నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌స‌న్‌ని కలిసింది మా క్రిస్టియన్ సమస్యల మీదనే త‌ప్ప  
అతనితో ఏ ఇతర అంశాలు నేను చర్చించలేదు. కానీ నన్ను ఉపయోగించి చంద్రబాబును ఇరికించాలని చూశారు.` అని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆ ఎపిసోడ్ త‌ర్వాత త‌నకు మంత్రి కేటీఆర్ సంప్ర‌దించార‌ని మ‌త్త‌య్య సంచ‌ల‌న విష‌యం వెల్ల‌డించారు. `కేటీఆర్ గన్ మెన్ ఫోన్ చేయడంతో ఆయన్ను ఇరికించేందుకు ఏపీ ప్రభుత్వం వాడుకోవాలని చూసింది. హైకోర్టులో కేసు ఉన్నప్పుడు ఏపీ ప్రభుత్వం సహకరించింది` అని మ‌త్త‌య్య త‌న పిటిష‌న్‌లో వివ‌రించారు.

సుప్రీంకోర్టు కేసు విషయంలో త‌నకు ఎవరూ సమాచారం ఇవ్వడం లేదని మ‌త్త‌య్య ఆరోపించారు. ` నాకు స‌హ‌క‌రించని విష‌యంలో నేను పార్టీ ఇన్ పర్సన్ గా అప్పియర్ అవుతానని పిటిషన్ వేశాను. నాకు తెలిసిన విషయం మొత్తం కోర్టుకు చెబుతాను` అని జెరూసలేం మత్తయ్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు