ఎగిరేపిట్టకు మసాలా నూరుతున్న ఏపీ కాంగ్రెస్

ఎగిరేపిట్టకు మసాలా నూరుతున్న ఏపీ కాంగ్రెస్

దేశంలో  కాంగ్రెస్ ఆరోగ్యం ఏమాత్రం  మెరుగుపడలేదు.. అయినా, ఏపీ కాంగ్రెస్ మాత్రం 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని అయిపోయినట్లుగా కలలు కంటోంది. అంతేకాదు, రాహుల్ ప్రధాని అయితే తొలి సంతకం దేనిపై పెడతారో కూడా వారే చెప్పేస్తున్నారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రధాని అయిన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదాపైనే తొలి సంతకం చేస్తారని కాంగ్రెస్ నేత చింతా మోహన్‌ అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులు నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బాబు, మోడీలు ఏపీకి మోసం చేసి ఇప్పుడు నాటకాలాడుతున్నారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో పొందు పరచలేదంటున్నబీజేపీ… నాలుగేళ్లలో పార్లమెంటులో ఒక్క సారి కూడా సవరణ బిల్లు ప్రవేశ పెట్టలేదని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

    ఇంతకుముందు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి కూడా ఇదే తరహాలో రాహుల్ తొలిసంతకం గురించి హామీ ఇచ్చారు. ఆయన ప్రధాని కాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తూ తొలి సంతకం చేస్తారని రఘువీరా అన్నారు. తాజాగా ఆయన ఏపీకి జరిగిన అన్యాయంపై టీడీపీ, వైసీపీలకు దీటుగా తామూ చేయబోతున్న పోరాట కార్యాచరణ ప్రకటించాు. మార్చి 6,7,8 తేదీల్లో పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ మార్చి 2న జాతీయ రహదారుల దిగ్బంధనం, 6,7,8 తేదీల్లో పార్లమెంటు ముట్టడి కార్యక్రమం చేపడతామని రఘువీరారెడ్డి తెలిపారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు