బిగ్ బి తాజాగా ఎవ‌రిని ఫాలో అయ్యారో తెలుసా?

బిగ్ బి తాజాగా ఎవ‌రిని ఫాలో అయ్యారో తెలుసా?

సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బిగ్ బి అమితాబ్ .. త‌ర‌చూ పోస్టుల మీద పోస్టులు పెడుతుంటారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ మ‌ధ్య‌నే ట్విట్ట‌ర్ లో త‌న ఫాలోవ‌ర్ల సంఖ్య‌ను త‌గ్గించేశార‌ని.. దాన్ని వీడిపోవాల‌ని తాను అనుకుంటున్నట్లుగా వ్యాఖ్య చేసి క‌ల‌క‌లం రేపిన ఆయ‌న‌.. ఈ మ‌ధ్య‌న త‌న‌దైన రీతిలో త‌ర‌చూ వార్త‌ల్లోకి వ‌స్తున్నారు.

అదే ప‌నిగా.. ప‌లువురు సెల‌బ్రిటీలు..సినిమా తార‌ల్ని ఆయ‌న ఫాలో అవుతూ అంద‌రికి స‌ర్ ప్రైజ్ మీద స‌ర్ ప్రైజ్ లు ఇచ్చేస్తున్నారు. బిగ్ బి స్వ‌యంగా త‌మ‌ను పాలో కావ‌టాన్ని ప‌లువురు సినీ తార‌లు గొప్ప‌గా చెప్పుకోవ‌ట‌మే కాదు డీపీగా పెట్టుకుంటూ పోస్టులు పెట్టేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. సినిమాతార‌ల్ని ఫాలో అయి.. వారిని సంతోష‌పెట్టేసిన బిగ్ బి తాజాగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని ట్విట్ట‌ర్ లో ఫాలో అవుతూ వార్తల్లోకి వ‌చ్చారు. గ‌తంలో కాంగ్రెస్ పార్టీతో స‌న్నిహితంగా మెలిగిన బిగ్ బి త‌ర్వాతి కాలంలో పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు ఉన్న‌ట్లుండి రాహుల్ ను ట్విట్ట‌ర్ లో ఫాలో కావ‌టం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

కాంగ్రెస్ అధినేత రాహుల్ తో పాటు.. ఆ పార్టీకి చెందిన చిదంబ‌రం.. క‌పిల్ సిబాల్‌.. అజ‌య్ మాకెన్.. స‌చిన్ పైలెట్ లాంటి ప‌లువురు సీనియ‌ర్ నేత‌ల్ని బిగ్ బి అనుస‌రిస్తున్నారు. ప్ర‌స్తుతం తెలుగులోకి సైరా న‌ర‌సింహారెడ్డితో స‌హా రెండు హిందీ సినిమాల‌తో బిజీగా ఉన్న ఆయ‌న‌కు దాదాపు 33.1 మిలియ‌న్ల ఫాలోవ‌ర్లు ఉన్నారు. ఉన్న‌ట్లుండి రాజ‌కీయాల మీద బిగ్ బికి ఎందుకు గాలి మ‌ళ్లిన‌ట్లు?  అందునా కాంగ్రెస్ నేత‌ల మీద?.. ఏమైనా అమితాబ్ కు కొత్త ప్లాన్ ఏమైనా ఉందా?  అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు