హోదా సాధ‌న‌కు ప‌వ‌న్ ప్లాన్ రెఢీ

హోదా సాధ‌న‌కు ప‌వ‌న్ ప్లాన్ రెఢీ

తెలంగాణ సాధ‌న కోసం సంవ‌త్స‌రాలు.. సంవ‌త్స‌రాల పాటు పోరాటం సాగినా.. ఉద్య‌మం న‌డిచినా హీట్ జ‌న‌రేట్ అయిన‌దానితో పోలిస్తే.. స్టూడెంట్స్ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత ఉద్య‌మ స్వ‌రూపం ఎంత‌లా మారిందో తెలిసిందే.  విద్యార్థులు ఒక‌సారి ఉరికిన త‌ర్వాత వారి పుణ్య‌మా అని.. ఉద్య‌మం పీక్స్ కు వెళ్ల‌ట‌మే కాదు.. తెలుగు నేత‌ల మీదా.. ఆపై ఢిల్లీలోని కాంగ్రెస్ నేత‌ల మీద ఎంత‌గా ఒత్తిడి పెరిగిందో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.

తెలంగాణ ఉద్య‌మాన్ని.. ఉద్య‌మ వ్యూహాన్ని అభిమానించే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం వ్యూహాన్ని సిద్ధం చేసిన‌ట్లు చెబుతున్నారు. త‌న బ‌ల‌మైన యూత్ ను ప్ర‌త్యేక హోదా సాధ‌న గోదాలోకి దించాల‌ని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఒక వ్యూహం ప్ర‌కారం ఈ ఉద్య‌మాన్ని నిర్మించాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం.

ఎందుకంటే.. యూత్ ను న‌మ్ముకొని రంగంలోకి వ‌స్తున్న ప‌వ‌న్‌.. వారి అభిమానాన్ని ఓట్లుగా మార్చుకోవాల‌న్న ప్లాన్ లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. హోదా సాధ‌న కోసం విద్యార్థులు ఏమేం చేయాల‌న్న అంశంపై జ‌న‌సేన పార్టీ విద్యార్థి విభాగం స్ప‌ష్ట‌మైన వ్యూహాన్ని సిద్ధం చేసిన‌ట్లుగా చెబుతున్నారు. ప‌వ‌న్ సూచ‌న మేర‌కు ఇప్ప‌టికే.. టీ షర్టుల్ని సిద్ధం చేయించారు. పెద్ద ఎత్తున సిద్ధం చేసిన టీష‌ర్ట్ ల‌ను వివిధ విశ్వ‌విద్యాల‌యాల్లోనూ.. క‌ళాశాల‌ల్లోనూ పంపిణీ చేయ‌నున్నారు.

ఈ టీ షర్టుల మీద ప్ర‌త్యేక హోదా ఆంధ్రుల హ‌క్కు అనే నినాదాన్ని ముద్రించారు. తెల్ల‌రంగు టీ ష‌ర్టుల‌పై జ‌న‌సేన పార్టీ లోగో.. ప్ర‌త్యేక హోదా సాధ‌న‌కు సంబంధించిన నినాదాన్ని ముద్రించారు. అదే స‌మ‌యంలో యూత్ ఎక్కువ‌గా ఉప‌యోగించే సోష‌ల్ మీడియాను ఉప‌యోగించుకొని హోదా వార్ కు రెఢీ కావాల‌ని భావిస్తున్నారు. ఏపీలోని రాజ‌కీయ పార్టీల మీద ఒత్తిడి పెంచి.. ఒక వేదిక మీద‌కు రాక త‌ప్ప‌ని ప‌రిస్థితి క‌ల్పించాల‌న్న‌ది ప‌వ‌న్ ప్లాన్ గా చెబుతున్నారు. మ‌రి.. ఆయ‌న వ్యూహం వ‌ర్క్ వుట్ అవుతుందా?  లేదా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు