ఇంకో మంత్రిగారి వికెట్‌ ఔట్‌?

ఇంకో మంత్రిగారి వికెట్‌ ఔట్‌?

ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డితో మంత్రి పార్దసారధి భేటీ అవడంతో ఈయన కూడా రాజీనామా చేయవచ్చునేమో అని ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. సిబిఐ ఛార్జీషీట్‌లో అభియోగాలు ఉన్నందుకు ఇద్దరు మంత్రులు రాజీనామా చేయాల్సి వచ్చింది. ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయగా, ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు రాజీనామా చేయాలని పిసిసి అధ్యక్షుడు ఈ రోజు వెల్లడించారు.

దాంతో, ఓ కేసులో శిక్ష పడిన మంత్రి పరిస్థితి ఏమిటన్న ప్రశ్న వచ్చింది. ఆ మంత్రి పార్ధసారధే. ఫెమా కేసులో మంత్రి పార్ధసారధికి రెండునెలల జైలు శిక్ష పడింది. అయితే ఆయన హైకోర్టుకు వెళ్లి స్టే పొందారు. అయినప్పట్టికీ శిక్షను రద్దు చేయలేదు కనుక ఆయన కూడ కళంకితుడే అవుతారు.

ఈ నేపధ్యంలో పార్ధసారధి ముఖ్యమంత్రిని కలిసి రాజీనామా విషయంపై చర్చించి ఉండవచ్చును. ఎవరో చెప్తే రాజీనామాలు చేస్తారేమోగాని నైతికత గురించి బాధ్యత గల పదవిలో ఉన్నవారు ఆలోచించని రోజులివి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు