సౌత్ సినిమాపై ఇల్లీ సెన్సేషనల్ కామెంట్స్

సౌత్ సినిమాపై ఇల్లీ సెన్సేషనల్ కామెంట్స్

దక్షిణాదిన సినిమాలు చేసినంత కాలం తనలోని గ్లామర్ కోణాన్నే ఎలివేట్ చేస్తూ సినిమాలు చేసింది తాప్సి. అప్పుడు ఈ గ్లామర్ రోల్స్ విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేకుండా నటించిందామె. కానీ బాలీవుడ్‌కు వెళ్లి.. అక్కడ పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్లు చేశాక ఆమెకు దక్షిణాదిన చేసిందంతా నాన్సెన్స్ అనిపించింది. తన తొలి సినిమా దర్శకుడు రాఘవేంద్రరావు మీద.. మిగతా సౌత్ ఫిలిం మేకర్ల మీద ఆమె ఎలాంటి కామెంట్లు చేసిందో తెలిసిందే. ఇప్పుడు సౌత్ సినిమాలతో పేరు సంపాదించి.. బాలీవుడ్‌కు వెళ్లి స్థిరపడిన మరో హీరోయిన్ ఇలియానా సైతం సరిగ్గా ఇలాంటి కామెంట్లే చేసింది.

సౌత్ సినిమాల్లో హీరోయిన్ల నడుము.. బొడ్డు సౌందర్యాన్ని ఎలివేట్ చేయడానికి ఫిలిం మేకర్స్ చాలా ఆరాటపడతారని.. అదెందుకో తనకు అర్థం కాదని ఆమె అంది. ‘దేవదాసు’ సినిమాతో తనకు లైఫ్ ఇచ్చిన వైవీఎస్ చౌదరి మీద కూడా ఈ విషయంలో ఆమె అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. ఆ సినిమా కోసం తాను నటించిన తొలి షాట్‌లో పెద్ద ఆల్చిప్పతో తన నడుం మీద కొడతారని.. అది తనకు చాలా ఇబ్బందిగా అనిపించిందని ఇలియానా చెప్పింది.

ఈ సీన్ ఎందుకు అని దర్శకుడిని అడిగితే.. అది చాలా అందంగా ఉంటుందని డైరెక్టర్ చెప్పాడని ఆమె తెలిపింది. అంతే కాక ‘నీకు చాలా అందమైన నడుం ఉంది. అది చాలా అందంగా కనిపిస్తుంది’ అని దర్శకుడు చాలాసార్లు చెప్పాడని.. కానీ తనకు మాత్రం అదేంటో అర్థం కాలేదని ఇలియానా చెప్పింది. సౌత్ సినిమాలో ఇప్పటికి కూడా హీరోయిన్ల బొడ్డును ఎలివేట్ చేసే తీరు మారలేదని.. అమ్మాయిల్ని కేవలం అందం కోణంలో మాత్రమే చేస్తారని ఇలియానా స్టేట్మెంట్ ఇవ్వడం గమనార్హం.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు