ఆ యాక్టర్ భార్య ముందు అలాంటి పని?

ఆ యాక్టర్ భార్య ముందు అలాంటి పని?

సినిమాల్లోను.. టీవీల్లోను సహజంగా పోలీసులను విలన్లుగా చూపడమో.. లేకపోతే వారిని చెడ్డవారిగా ప్రొజెక్ట్ చేయడమో ఎక్కువగా కనిపిస్తుంది. కానీ పోలీసులు రియల్ హీరోల మాదిరిగా ప్రవర్తిస్తే.. ఎలా ఉంటుందో ఇవాళ జరిగిన ఓ సంఘటన చెబుతుంది.

ముంబై నడిమధ్యలో జరిగిన ఓ వికృత సంఘటన గురించి సోషల్ మీడియాలో చెప్పడమే కాకుండా.. పోలీసులకు కంప్లెయింట్ ఇచ్చాడో నటుడు. సుమీత్ అనే హిందీ టీవీ నటుడి భార్యకు ఓ వికృత చర్య ఎదురైంది. విలే పార్లే ఈస్ట్ ప్రాంతంలో పార్లే తిలక్ స్కూల్ సమీపంలో ఈ నటుడి భార్య ఉండగా.. ఓ బీఎండబ్ల్యూ కారు డ్రైవరు.. ఆమె ఎదురుగుండా హస్తప్రయోగం చేసుకోవడం ప్రారంభించాడట. దీన్ని గమనించిన ఆమె.. అతని చెంప ఛెళ్లుమనిపించేలోగా పారిపోయాడట.

ఈ హడావిడిలో ఆ కారు నెంబరు చివరి నాలుగు అంకెలను మాత్రమే ఆమె గుర్తుంచుకోగా.. 1985 నెంబరను సోషల్ మీడియాలో పెట్టిన అతను.. పోలీస్ కంప్లెయింట్ కూడా ఇచ్చాడు. కేవలం రెండు గంటలలోనే అతని అరెస్ట్ చేసేశారు ముంబై పోలీసులు. ఇంత వేగంగా అగంతకుడిని పట్టుకున్నందుకు పోలీసులను అభినందించాడు సుమీత్. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినపుడు.. సైలెంట్ గా ఉండేకంటే.. ధైర్యంగా ఇలా కంప్లెయింట్ చేసి పట్టించడం అభినందించాల్సిన విషయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు