పవన్‌ను నమ్మేదెవరు?: రోజా

పవన్‌ను నమ్మేదెవరు?: రోజా

ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు ధర్నాలు, నిరసనలు చేస్తానని ఇంతకుముందు జబ్బలు చరిచిన పవన్ ఇప్పుడు ఎందుకు వెనక్కు తగ్గారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా ఈ రోజు ఉదయం తిరుమలలో విలేకరులతో మాట్లాడుతూ పవన్‌కు ఇదే ప్రశ్న వేశారు.

గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు ధర్నాలు, నిరసనలకు దిగుతానని హెచ్చరించిన పవన్ కల్యాణ్, ఇప్పుడు వెనక్కు తగ్గడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు.  ప్రశ్నిస్తానంటూ గొప్పలు చెప్పుకున్న పవన్, నాలుగేళ్ల పాటు మౌనంగా ఉండి, ఇప్పుడు జేఎఫ్సీ అంటూ ప్రజల ముందుకు వస్తే నమ్మబోరని అన్నారు.

రాజకీయ పక్షాలు పార్టీలకు అతీతంగా ఏకతాటిపైకి వచ్చి పోరాడితేనే ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. పవన్ సూచించిన విధంగా కేంద్రంపై అవిశ్వాస తీర్మానంపెడితే జగన్ మద్దతిస్తారని, అందుకు అవసరమైన ఎంపీల మద్దతు కోసం పవన్ సహకరించాలని డిమాండ్ చేశారు. హోదా ఇవ్వకపోతే ఎంపీలు రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉండాలని పవన్‌ 2016లో చెప్పి, ఇప్పుడు రాజీనామాలు ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టాలని కోరడం నవ్వు తెప్పిస్తోందన్నారు.

మరోవైపు ఆమె నిన్న చంద్రబాబుపైనా విరుచుకుపడ్డారు. టీడీపీ నాయకులకు ప్రత్యేక హోదా కన్నా ప్యాకేజీలే ముఖ్యమని, కేంద్రంతో పోరాడే శక్తి లేక ప్రతి దానికీ రాజీపడిపోతున్నారని అన్నారు. బడ్జెట్లో ఏపీకి అన్యాయం చేసి ఇన్ని రోజులవుతున్నా ఇప్పటివరకు ఆయన కాని, ఆయన పార్టీ ఎంపీలు, మంత్రులు  ఎన్‌డీఏ నుంచి వైదొలుగుతామని ఎందుకు చెప్పలేకపోతున్నారని అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English