ఆరోపిస్తే భష్ట్రుపట్టిపోతారా?

ఆరోపిస్తే భష్ట్రుపట్టిపోతారా?

అసత్యపు ఆరోపణలతో భ్రష్టుపట్టించేందుకే తనపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి కన్నా లక్ష్మినారాయణ అనడం ఆశ్చర్యంగా ఉంది. 26 జీవోల చుట్టే వివాదం తిరుగుతోందని మంత్రి కన్నా తెలిపారు. రాజకీయంగా ఎదుర్కోలేకే తనపై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి కన్నా తెలుగుదేశం పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది.

వివాదాస్పద జీవోలకు సంబంధించి కన్నా లక్ష్మినారాయణ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రత్యర్థుల ఆరోపణల్ని తిప్పి కొట్టగలగాలిగాని, భ్రష్టు పట్టించేందుకే ఆరోపణలు చేస్తున్నారనడం మంత్రిగారికి ఎంతవరకు సబబో. రాజకీయాలన్నాక విమర్శలు చేయక తప్పదిప్పుడున్న రాజకీయ వాతావరణంలో. ఏ రాజకీయ ఆరోపణలూ చేయకుండానే రాజకీయాల్లో కన్నా లక్ష్మినారాయణ కొనసాగుతున్నారా? మోపిదేవి వెంకటరమణపై ఆరోపణలొచ్చాయి, ఆయన జైల్లో ఉన్నారు. సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావులపై ఆరోపణలొచ్చాయి, వారు పదవులకు రాజీనామా చేశారు. కాంగ్రెసు పార్టీని కుదిపేస్తున్న జగన్‌ అవినీతి వివాదంలో కన్నా ఏమవుతారో నిర్ణయించేది కాలమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు