ఏప్రిల్ 6 దాకా ఎందుకు... మార్చి 5నే మా రాజీనామాలు : టీడీపీ

ఏప్రిల్ 6 దాకా ఎందుకు... మార్చి 5నే మా రాజీనామాలు : టీడీపీ

జ‌గ‌న్ కు టీడీపీ ఊహించ‌ని  షాక్ ఇచ్చింది. పార్ల‌మెంటు స‌మావేశాలు అయిపోయాక నామ్ కే వాస్తే రాజీనామాలు ఎందుకు జ‌గ‌న్‌... మా త‌డాఖా నీకంటే నెల ముందే కేంద్రానికి చూపిస్తాం... ఆ ద‌మ్ము టీడీపీకి ఉంది అని తెలుగు దేశం జ‌గ‌న్ పార్టీకి భారీ ట్విస్ట్ ఇచ్చింది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం ఏపీకి 19 హామీలిచ్చింది. అవి తూ చ త‌ప్ప‌కుండా నెర‌వేర్చాలి. దానికి డెడ్‌లైన్ వ‌చ్చే పార్ల‌మెంటు స‌మావేశాల మొద‌టి రోజే. ఆరోజు క‌నుక బీజేపీ మాట త‌ప్పితే మార్చి ఐదో తేదీన టీడీపీ కేంద్ర మంత్రులు రాజీనామా చేస్తారు. మ‌రుస‌టి రోజే బీజేపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేస్తాం అంటూ టీడీపీ త‌ర‌ఫున రాష్ట్ర మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి తేల్చి చెప్పారు.

టీడీపీ చూపుతున్న ఈ ధైర్యం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే కాకుండా బీజేపీని కూడా త్రిశంకు స్వ‌ర్గంలోకి నెట్టింది. కేంద్రం ఏపీకి అన్యాయం చేస్తుంటే... చూస్తు ఊరుకోవ‌డానికి తెలుగుదేశం పార్టీ ఏం సిద్ధంగా లేదు. అస‌లు టీడీపీ బీజేపీతో జ‌త కట్టిందే ఏపీ ప్ర‌యోజ‌నాల కోసం. అదే నెర‌వేర‌న‌పుడు ఇక ఆ పార్టీతో మాకు గాని, రాష్ట్రానికి గాని ఏం ప‌ని లేదు అని ఆయ‌న వ్యాఖ్యానించారు. కేంద్రం మాట‌కు క‌ట్టుబ‌డాలి. ఏపికి ఇచ్చిన 19 హామీలు నెర‌వేర్చాలి. నిధుల విడుద‌ల వెంట‌నే జ‌ర‌గాలి. అలా లేని ప‌క్షంలో ఏపీ ప్ర‌జ‌ల త‌ర‌ఫున టీడీపీ పోరాటం ఉధృతం చేస్తుంది.
అయితే, జ‌గ‌న్ ఏప్రిల్ 6 హామీల‌పై చ‌ర్చ న‌డుస్తున్న నేప‌థ్యంలో టీడీపీ తీసుకున్న ఈ నిర్ణ‌యం అంద‌రినీ విస్మ‌యానికి గురిచేసింది. రాజీనామాలు నిజంగా చేసే ఉద్దేశం లేక‌పోవ‌డం వ‌ల్లే జ‌గ‌న్ ఒక వ్యూహాత్మ‌క డెడ్‌లైన్ పెట్టాడ‌ని, జ‌గ‌న్ చెప్పిన తేదీన రిజైన్ చేసిన వారే వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు ఎంపీలుగా కొన‌సాగుతారు, లేదా అక్క‌డ ఎన్నిక‌లు జ‌ర‌గ‌వు. కాబ‌ట్టి అవి రాజకీయ రాజీనామాలే త‌ప్ప ఏపీ కోసం చేసే రాజీనామాలు కానేకావ‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో టీడీపీ తీసుకున్న ఈ నిర్ణ‌యం సంచల‌నం అయ్యింది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు