ఇక సినిమాలకు సెలవ్

ఇక సినిమాలకు సెలవ్

రంగుల ప్రపంచంలో లోక నాయకుడిగా ఎదిగిన స్టార్ట్ హీరో కమల్ హాసన్ ఇక సినిమాలకు గుడ్ బాయ్ చెప్పేసే సమయం వచ్చేసింది అని క్లారిటీ ఇచ్చేశాడు. సినిమా కథ ఒక బలం అయితే అందులో కథానాయకుడి పాత్ర ఒక ఆయుధం అని అందరు చెప్పుకునేలా నటించడం కమల్ హాసన్ కి వెన్నతో పెట్టిన విద్య. డ్యాన్స్ అయినా యాక్షన్ సీన్స్ అయినా సరే తనదైన శైలిలో చేసి బాక్స్ ఆఫీస్ వసూళ్లను కమల్ రాబట్టగలడు.

మరి అలాంటి హీరో ఇప్పుడు సినిమాల నుంచి ఎందుకు తప్పుకోవడం అనేది ఇప్పుడు అందరి మదిలో మెదులుతోన్న ప్రశ్న. అయితే కమల్ కి ఒక నటుడిగా తన జీవితాన్ని ముగించాలని లేదట. తనకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక బలంగా ఉందట. ప్రజలకు ఎంతో కొంత సేవ చేసి జీవితాన్ని ముగించాలన్నది ద్యేయమని అందుకే రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నట్లు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లియర్ గా చెప్పేశాడు.

ఇక రాజకీయాల్లో ఓటమి చెందితే అనే విషయం గురించి మాట్లాడుతూ.. దాని గురించి ఇంకా నేను ఆలోచించలేదు. రాజకీయం అంటే ప్రజలకు మంచి చేయడం ఇతరులకు మంచి చేయలనే ఆలోచన ఉంటే గెలవాల్సిన అవసరం లేదు. సమస్యలపై పోరాటం చేయగలగాలని కమల్ హాసన్ వివరించాడు. అయితే రెండు సినిమాల తరువాత పూర్తిగా నటనకు దూరం కానున్నట్లు ఈ దశావతారుడు తెలియజేశాడు.  

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English