మాల్యాకు బ్రిట‌న్ హైకోర్టు షాక్!

మాల్యాకు బ్రిట‌న్ హైకోర్టు షాక్!

లిక్క‌ర్ కింగ్ విజ‌య్ మాల్యా..... భార‌త్ లో బ్యాంకుల‌కు వేల కోట్ల రూపాయ‌లు ఎగ్గొట్టి ఎంచ‌క్కా లండ‌న్ లో ఎంజాయ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. స్వ‌దేశంలోని బ్యాంకుల‌కు దాదాపు 9 వేల కోట్ల రూపాయ‌లు పంగ‌నామం పెట్టి....విదేశాలకు చెక్కేసిన మాల్యాను భార‌త్ కు ఎప్పుడు ర‌ప్పిస్తారా అని భార‌తీయులంద‌రూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మ‌రోవైపు, మాల్యాను భార‌త్ కు ర‌ప్పించేందుకు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే, భార‌త్-బ్రిట‌న్ ల మ‌ధ్య ఉన్న చ‌ట్టాలు, ఒప్పందాల‌లోని లొసుగుల‌న తెలివిగా ఉప‌యోగించుకుంటున్న మాల్యా భార‌త్ కు రాకుండా త‌ప్పించుకుంటున్నాడు. తాజాగా, బ్రిట‌న్ లోని హైకోర్టు ...మాల్యాకు షాకిచ్చింది.

మాల్యా ఒక వెలుగు వెలిగిన స‌మ‌యంలో కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్ పై భారీగా లాభాలు సంపాదించాడు. అందులో భాగంగా....అద్దెకు తీసుకున్న సింగ‌పూర్ కు చెందిన బీఓసీ ఏవియేషన్ సంస్థ.... కింగ్ ఫిష‌ర్ ఎయిర్ లైన్స్ కు 3 విమానాల‌ను అద్దెకు ఇచ్చింది. ఆ ఒప్పందంలో భాగంగా బీఓసీకి మాల్యా దాదాపు 90 మిలియన్‌ డాలర్లు బ‌కాయి ప‌డ్డాడు. అయితే, మాల్యా లండన్ లో త‌ల‌దాచుకోవ‌డంతో బీఓసీ.....బ్రిటన్‌ హైకోర్టును ఆశ్ర‌యించింది. దీంతో, లీజింగ్‌ అగ్రిమెంట్ బీఓసీకి ఆ డ‌బ్బును చెల్లించాల‌ని తాజాగా బ్రిట‌న్ లోని హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో, మాల్యాకు తొలిసారిగా `బ‌కాయి` షాక్ త‌గిలింది. మ‌రోవైపు, లండన్‌ కోర్టు వెలువరించిన తీర్పును బీఓసీ ఏవియేషన్‌ స్వాగతించింది. కాగా, మాల్యాను భారత్ కు అప్పగించే కేసుపై లండన్ లోని వెస్ట్‌మినిస్టర్‌ కోర్టులో విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. మాల్యాకు తొలి షాక్ త‌గ‌ల‌డంతో త్వ‌ర‌లోనే అత‌డిని భార‌త్ కు ర‌ప్పించేందుకు ఈడీ అధికారులు మ‌రింత ఒత్తిడి పెంచ‌బోతున్నార‌ని తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు