ట్రోల్ బ్యాచ్‌కి ... కేటీఆర్ డాషింగ్ పంచ్‌

ట్రోల్ బ్యాచ్‌కి ... కేటీఆర్ డాషింగ్ పంచ్‌

ప్ర‌పంచంలో ఏ ఆవిష్క‌ర‌ణ జ‌రిగినా అది మంచికి చెడుకు రెండింటికీ ఉప‌యోగ‌ప‌డుతుంది. అలాగే సోష‌ల్ మీడియా కూడా. అదేంటో గాని... ఫేస్ బుక్‌-ట్విట్ట‌ర్ చేతిలో ఉంటే చాలా మంది ఒక మ‌హా జ్ఞానిలా ఫీల‌యి జ‌నానికి సుద్ధులు చెప్పే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. వీళ్ల తీరు ఎలా ఉంటుందంటే... నువ్వు ఎలాంటోడ‌యినా మాకు ఫ‌ర్లేదు, బ‌య‌టికి మాత్రం మంచోడిలా న‌టించు అన్న‌ట్లు ఉంటుంది. ఈ బ్యాచ్ కి నిరంత‌రం సోష‌ల్ మీడియా ముందు కూర్చుని జ‌నాల్ని ట్రోల్ చేయ‌డ‌మే ప‌ని. ఇలాంటి వారికి కేటీఆర్ ప‌ర్‌ఫెక్ట్ రిట్టార్ట్ ఇచ్చారు.

ఈ ట్రోల్ బ్యాచ్ కామెంట్లు ఎలా ఉంటాయంటే.... సెల‌బ్రిటీలు మ‌నుషుల్లా బ‌త‌క‌కూడ‌దు అన్న‌ట్టు ఉంటాయి. ఈ భూమి మీద మ‌నిషి ఎవ‌డైనా ఒక‌టే. అంద‌రికీ కోరిక‌లు ఉంటాయి. మంత్రి అయినా అత‌ను ఒక మ‌నిషే. కేటీఆర్ సినిమా చూసి బాగుందంటే.. రైతుల గురించి వ‌దిలేసి సినిమాలు చూస్తావా అంటారు. అస‌లు కేటీఆర్ ఇప్పుడే కాదు... అత‌ను ఎపుడూ ప‌ర్స‌న‌ల్ లైఫ్ మిస్స‌వడు. త‌న స్కూలు పేరెంట్ టీచ‌ర్ మీటింగ్ కి వెళ్తాడు. అంద‌రిలానే వాకింగ్ వెళ్తాడు. నిజానికి ఒక జెంటిల్‌మెన్ బిహేవియ‌ర్ అది. ఎపుడూ సినిమాలు చూడ‌కుండా, టూర్లు వెళ్ల‌కుండా ఉండే నాయ‌కులంతా ప్ర‌జా సేవ‌లో అంకిత‌మ‌యిన‌ట్లు కాదు, జీవితాన్ని ఎంజాయ్ చేసేవాళ్లంతా స‌మాజాన్ని వ‌దిలేసినోళ్లు కాదు. యాపిల్ సృష్టిక‌ర్త స్టీవ్ జాబ్స్ క‌ట్టిన‌న్ని ట్రాఫిక్ చలానాలు ఎవ‌రూ క‌ట్టి ఉండ‌రు. అంత‌మాత్రాన అత‌ను ఒక వేస్ట్ ఫెలో అవుతాడా? అంద‌రూ తెలుగు గురించి ట్రోల్ చేసే మ‌ంచు ల‌క్ష్మి చేసిన మేము సైతం ప్రోగ్రాంతో ఎన్ని జీవితాలు బాగ‌య్యాయో అంద‌రికీ తెలుసు క‌దా.  రాజ్యాంగం భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ ఇచ్చింద‌ని, చేతిలో సోష‌ల్ మీడియా ఉంద‌ని... ట్రోల్ చేస్తామంటే అంద‌రూ ఒకేలా స్పందించ‌రు క‌దా. ఇలాంటి వారికి కేటీఆర్ ట్వీట్ స‌రైన రిటార్ట్‌.

కేటీఆర్‌ని ప‌ది ల‌క్ష‌ల మంది ఫాలో అయితే.... అత‌ను *తొలిప్రేమ‌* చూసి చేసిన ట్వీట్‌పై నెగెటివ్ ట్రోల్ చేసిన వారు ఎంత‌మంది?  99.9 ప‌ర్సెంట్ జ‌నాలు వ్య‌తిరేకించ‌లేదు క‌దా మ‌రి. ప‌నీ పాటా లేని కొంద‌రు అవ‌కాశం దొరికిన‌పుడు అడ్డ‌దిడ్డంగా మాట్లాడితే అది వార్త అవుతుంది. కానీ కేటీఆర్ దానిని క‌రెక్టుగా ఎదుర్కొన్నారు. నాకూ ప‌ర్స‌న‌ల్ లైఫ్ ఉంటుంది. నేను న‌చ్చ‌క‌పోతే అన్ ఫాలో చేయండి అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ట్రోల్ బ్యాచ్ బారిన ప‌డి ఎంతో మాన‌సిక వ్య‌థ‌కు గుర‌వుతున్న టాలీవుడ్ సెల‌బ్స్ కేటీఆర్ ను  చూసి ధైర్యం తెచ్చుకోవాలి. ప్ర‌తి ఒక్క‌రికి ప‌ర్స‌న‌ల్ లైఫ్ ఉంటుంది. దానిని ప్ర‌శ్నించే హ‌క్కు ఎవ‌రికీ ఉండ‌దు. అందుకే కేటీఆర్ యు ఆర్ రైట్‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు