పవన్.. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ

పవన్.. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ

ఆచరణ ఎలా ఉన్నా ఆలోచనల్లో మాత్రం కొంచెం కూడా తగ్గని జనసేనాధిపతి పవన్ కల్యాణ్ తాజాగా ఆంధ్రప్రదేశ్ సమస్యలపై కొత్త ప్రపోజల్ ఒకటి పెట్టారు. విభజన హామీలపై సంయుక్త నిజనిర్ధారణ కమిటీ(జేఎఫ్ సీ) ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. అంతేకాదు.. ఆ కమిటీలో ఎవరెవరు ఉండాలో కూడా ఆయన సూచించారు. ఆర్థిక వేత్తలు, మాజీ ప్రభుత్వాధికారులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్లలు, రాజకీయ నాయకులు ఈ కమిటీలో ఉండాలని పవన్ చెప్పారు.

    ఈ జేఎఫ్‌సీ ఏ వ్యక్తిగత, రాజకీయ స్వార్థం, వివక్ష లేకుండా ఏపీ పునర్విభజన హామీలను విశ్లేషించి నివేదిక అందిస్తుందని చెప్పారు. అలాగే, జాయింట్ పొలిటికల్ యాక్షన్ కమిటీ కూడా ఏర్పాటు చేయాల్సి ఉందని చెప్పారు. జేఎఫ్‌సీ అందించిన నివేదిక ప్రకారం జాయింట్ పొలిటికల్ యాక్షన్ కమిటీ రాజకీయ కార్యాచరణను రూపొందిస్తుందని చెప్పారు.  

    గతంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించగా టీడీపీ ప్రభుత్వం దానికి ఒప్పుకుందని, ఇప్పుడు ఒక్కసారిగా ప్రత్యేక ప్యాకేజీని అమలు చేయని తీరును గురించి ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ రోజు ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. కేంద్రం, రాష్ట్రం మ‌ధ్య వివాదం నెల‌కొన్న అంశాల‌ను విస్తృతంగా చ‌ర్చించాల్సిన అవసరం ఉందని అన్నారు.

    అయితే.. చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీ పవన్ నిజనిర్దారణ కమిటీకి ఓకే అన్నా కూడా రాష్ర్టంలోని మిగతా రాజకీయ పార్టీలు పవన్ మాటను పట్టించుకుంటాయా అన్నది చూడాలి. అలాంటప్పుడు పవన్ నిజనిర్దారణ సంఘాలు, టీడీపీ నిజ నిర్దారణ సంఘాలుగా మిగిలిపోక తప్పదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English