వరుణ్-సంకల్ప్.. కేరాఫ్ శ్రీహరి కోట

వరుణ్-సంకల్ప్.. కేరాఫ్ శ్రీహరి కోట

తన తొలి సినిమా ‘ఘాజీ’తో తెలుగు సినీ పరిశ్రమకే కాదు.. మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకే పెద్ద షాకిచ్చాడు యువ దర్శకుడు సంకల్ప్ రెడ్డి. ఒక తొలి చిత్ర దర్శకుడి నుంచి ఇలాంటి సినిమాను అస్సలు ఊహించలేం.
ఇలాంటి సాహసోపేత కథతో ఒక కొత్త దర్శకుడు సినిమా తీయడమే సాహసమంటే.. చాలా తక్కువ ఖర్చుతో రిచ్‌గా, పకడ్బందీగా సినిమా తీసి అబ్బురపరిచాడు సంకల్ప్. ఆ సాహసానికి మంచి ఫలితమే దక్కింది. ఈ ఉత్సాహంతో తన తర్వాతి సినిమాతోనూ మరో ప్రయోగం చేయబోతున్నాడు సంకల్ప్. మెగా కుర్రాడు వరుణ్ తేజ్ హీరోగా అతను ఈసారి ఒక స్పేస్ ఫిలిం తీయబోతున్నట్లు ఇంతకుముందే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రాన్ని వరుణ్ తేజ్ ధ్రువీకరించాడు. ఈ సినిమా గురించి అతను చెబుతూ.. ‘‘నాతో ‘కంచె’ సినిమా తీసిన నిర్మాతలే ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నారు. రెండు నెలల తర్వాత ఈ సినిమా మొదలవుతుంది. అంతరిక్షం నేపథ్యంలో సాగే కథ తెలుగు ప్రేక్షకులకు కొత్త. ఇది పూర్తి స్థాయి స్పేస్ ఫిలిం. ప్రస్తుతం నా దృష్టంతా ఈ సినిమా మీదే ఉంది. ఇది నాకు ప్రెస్టీజియస్ మూవీ అవుతుంది. మన శ్రీహరి కోట నేపథ్యంలోనే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తాం’’ అని వరుణ్ తెలిపాడు. ఇది కాకుండా కొత్తగా ఏ సినిమా ఒప్పుకోలేదని.. ఈ సినిమా పూర్తయ్యే వరకు తాను దీని మీదే దృష్టిసారిస్తానని.. తనకు ఈ సినిమా అంత స్పెషల్ అని వరుణ్ చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English