సిబిఐ రంగంలోకి దిగితేనో..

సిబిఐ రంగంలోకి దిగితేనో..

టిఆర్‌ఎస్‌ నుంచి సస్పెన్షన్‌కి గురైన ఆ పార్టీలో ఒకప్పుడు పనిచేసిన నేత రఘునందనరావు కొన్ని రోజులనుంచి టిఆర్‌ఎస్‌పై ఘాటు ఆరోపణలు చేస్తూ వచ్చారు. అకారణంగా తనను పార్టీలోంచి బయటకు పంపడాన్ని రఘునందన్‌ జీర్ణించుకోలేకున్నారు. అందుకే టిఆర్‌ఎస్‌ని ఇరకాటంలో పడేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారాయన. ఆ కోవలో మరో సంచలన ఆరోపణ చేశారు.

జగన్‌ కేసులో నిందితుడుగా ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ నుంచి టిఆర్‌ఎస్‌ నేతలు పది కోట్ల రూపాయలు తీసుకున్నారని ఆరోపించారు. దీనికి సంబందించిన ఆదారాలు సిబిఐకి ఇచ్చినట్లు ఆయన విూడియాకు చెప్పారు. సిబిఐ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మినారాయణను రఘునందన్‌ కలిశారు. అలాగే ఎమ్‌.ఆర్‌.కేసులో ఉన్న కోనేరు ప్రసాద్‌, తుమ్మల రంగారావులతో కెసిఆర్‌, హరీష్‌ రావు లావాదేవీలు నడిపారని ఆయన ఆరోపించారు.

అయితే రఘునందన్‌ ఆరోపణలను టిఆర్‌ఎస్‌ ఖండించింది. సిబిఐతో కాకుంటే ఎఫ్‌బిఐతో అయినా తమపై విచారణ చేయించుకోవచ్చని చెప్పారు టిఆర్‌ఎస్‌ నేత శ్రవణ్‌కుమార్‌. సిబిఐ నిజంగా రంగంలోకి దిగితే, 'కక్ష సాధింపు' అంశాన్ని టిఆర్‌ఎస్‌ బయటకు లాగే అవకాశం ఉన్నది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు