ఆస్ప‌త్రికి కేసీఆర్‌.. ఇపుడు వ్యాధి కొత్త‌ది

ఆస్ప‌త్రికి కేసీఆర్‌.. ఇపుడు వ్యాధి కొత్త‌ది

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రోమారు హ‌స్తిన బాట ప‌ట్టారు. అయితే ఇది కేవ‌లం ప్ర‌జా స‌మ‌స్య‌ల కోస‌మే కాద‌ని ఆయ‌న ఆరోగ్య స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం కూడా అని చ‌ర్చ జ‌రుగుతోంది. టీఆర్ఎస్ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. గతంలో అక్కడే కంటికి శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన.. మరోసారి వైద్యుల్ని కలిసేందుకు వెళ్లినట్టు ముఖ్యమంత్రి కార్యాయల వర్గాలు తెలిపాయి. వ్యక్తిగత పనుల నిమిత్తం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు శుక్రవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారని వివ‌రించాయి.

గ‌తంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఢిల్లీలో కంటి చికిత్స చేయించుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఆయ‌నకు తాజాగా పంటి స‌మ‌స్య ఎదురైన‌ట్లు తెలుస్తోంది. పంటి నొప్పికి చికిత్స చేయించుకునే క్రమంలోనే ఆయన ఢిల్లికి వచ్చారని, ఇక్కడ రెండు, మూడు రోజులు విశ్రాంతి తీసుకుంటారని తెలుస్తోంది. కాగా, ఢిల్లీకి వ‌చ్చిన సీఎం కేసీఆర్ నేరుగా తుగ్లక్‌ రోడ్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. ఢిల్లీల‌లో 3 నుంచి 4 రోజుల పాటు ఉంటారని తెలుస్తోంది. అయితే ఈ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమని, అందుకే అధికారులెవరినీ తన వెంట తీసుకు రాలేదని తెలంగాణ భవన్‌ వర్గాల ద్వారా తెలిసింది.

మ‌రోవైపు కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌పై కొత్త చ‌ర్చ మొద‌లైంది. ఆయన ప్రధాని మోడీని కలవాలని భావిస్తున్నారని స‌మాచారం. ప్రస్తుతం ప్రధాని విదేశీ పర్యటనలో ఉన్నందున.. ఆయన వచ్చేదాకా ఢిల్లీలోనే మకాం వేయాలని తసీఎం భావిస్తున్నట్టు తెలిసింది. మోడీ వచ్చిన తర్వాత ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయి.. బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరి చేయాలంటూ కోరతారని సమాచారం. రైల్వే ప్రాజెక్టులు, పసుపు కర్మాగారం తదితరాంశాలను కూడా కేసీఆర్‌ ఏకరువు పెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English