బాబు త‌ల‌చుకుంటే మోడీని దింపేయ‌గ‌ల‌డు !

బాబు త‌ల‌చుకుంటే మోడీని దింపేయ‌గ‌ల‌డు !

మాట వింటే మీకు క‌న్ఫ్యూజ‌న్ క‌ల‌గొచ్చు. కానీ ఈ మాట అన్న‌ది ఎవ‌రో తెలిస్తే క్లారిటీ వ‌స్తుంది. అవును... ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న శ‌క్తిని తాను న‌మ్మ‌డం లేద‌ని, ఆయ‌న క‌నుక త‌ల‌చుకుంటే ప్ర‌ధాని మోడీని సీట్లోంచి దింపేయ‌గ‌ల‌ర‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మోడీ ప్ర‌భ భారీగా త‌గ్గిపోతూ వ‌స్తోంద‌ని... రాజ‌స్తాన్ ఎన్నిక‌ల ఫ‌లితాలు చూశాక త‌ను ఎంత బ‌ల‌హీన‌మైనది మోడీకి కూడా అర్థ‌మైంద‌ని ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ అన్నారు.

చంద్ర‌బాబు కు టైం వ‌చ్చింద‌ని, అత‌ను త‌ల‌చుకుంటే మోడీని దింప‌డం పెద్ద‌కాద‌ని, ఎందుకంటే ఇపుడు ప‌రిస్థితులు అందుకు అనుగుణంగా ఉన్నాయ‌న్నారు. చంద్ర‌బాబు త‌న ధైర్యంలో ఓ ప‌దిశాతం ప్ర‌ద‌ర్శించినా ఇపుడు మోడీకి మూడుతుంద‌న్నారు. కేంద్ర‌మంత్రుల‌ను వెంట‌నే రాజీనామా చేయించాల‌ని స‌ల‌హా ఇచ్చారు. ఇపుడు శ‌తృఘ్న సిన్హా, య‌శ్వంత్ సిన్హా వంటి వ్యూహ ర‌చ‌న కారులు, శివ సేన‌తో పాటు ప‌లు పార్టీలు బీజేపీకి దూరం అయ్యాయ‌ని అన్నారు. మోడీ అంటే ప్ర‌జ‌ల్లో చాలా అస‌హ‌నం ఉంద‌ని, ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవ‌డానికి చంద్ర‌బాబుకు ఇదే స‌రైన స‌మ‌యం అని ఉండ‌వ‌ల్లి వ్యాఖ్యానించారు.

మోడీ తాను అస‌మ‌ర్థుడిని అని ఇప్ప‌టికే ప‌లుసార్లు నిరూపించుకున్నాడని.. పార్ల‌మెంటులో మొన్న ప్ర‌సంగం ద్వారా మ‌రోసారి అది రుజువైంద‌న్నారు. కాంగ్రెస్ పార్టీ త‌ప్పు చేస్తే... మూడున్న‌రేళ్లు మోడీ ఏం చేశారు వాటిని స‌రిదిద్ద‌కుండా అని విమ‌ర్శించారు. ప్ర‌జ‌ల్లో మోడీ విధానాలు చాలా కోపాన్ని తెప్పించాయ‌ని, జీఎస్టీ-డీమానిటైజేష‌న్ వంటివి ఆయ‌న మొద‌ట్లో ఆయ‌న ప్ర‌భ పెంచినా ఇపుడు వాటి వ‌ల్ల న‌ష్ట‌పోయామ‌న్న బాధ ప్ర‌జ‌ల్లో ఉంద‌న్నారు. ఇపుడు ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు మోడీకి లేద‌ని చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English