జైట్లీ... మాపై సానుభూతి చూప‌డానికి నువ్వు ఎవ‌రు?

జైట్లీ... మాపై సానుభూతి చూప‌డానికి నువ్వు ఎవ‌రు?

అధికారం అనే అహంకారం త‌ల‌కు ఎక్కితే దానికి రూపం బీజేపీలా ఉంటుంది. ఆంధ్రుల‌కు విభ‌జ‌న రోజు జ‌రిగిన అవ‌మానం కంటే పార్ల‌మెంటులో ఘోర‌మైన అవ‌మానం జ‌రిగింది ఈరోజు. ఇప్ప‌టివ‌ర‌కు ఏపీకి ఒక‌ట్రెండు త‌ప్ప అన్నీ ఇచ్చాం అని ఒక దారుణ‌మైన వ్యాఖ్య చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ *ఏపీపై మాకు సానుభూతి ఉంది* అనే ఒక అనకూడ‌ని మాట అన్నారు.  

జైట్లీ.. ఏపీ ప్ర‌జ‌లు శ‌ర‌ణార్థులా నీ జాలి, సానుభూతి కోసం ఎదురుచూడ‌టానికి. ఎవ‌ర‌య్యా నువ్వు సానుభూతి చూప‌డానికి? దేశంలో అంద‌రు ప్ర‌జ‌ల్లాగే ఇంకా చెప్పాలంటే... అంద‌రికంటే ఎక్కువ‌గా దేశానికి ప‌న్నులు క‌డుతున్న ఆంధ్రులం మేం. దేశానికి స‌హ‌జ వ‌న‌రులు ఇస్తున్నాం. దేశానికి అన్న‌పూర్ణ‌గా ధాన్యం ఇస్తున్నాం. నువ్వు మాకు సానుభూతి చూప‌డం ఏంటి? ఇంత బ‌రితెగింపు మాట‌లా? అస‌లు లెక్క‌లు తీస్తే నువ్వు ఏపీకి ఇచ్చింది స‌ముద్రంలో కాకిరెట్టంత‌.

మూడున్న‌రేళ్ల కింద ఏపీకి రైల్వే జోన్ ఇస్తామ‌న్నారు. ఇపుడు పక్క‌రాష్ట్రాలు అడ్డుచెబుతాయంటారా?
రాష్ట్ర రెవెన్యూ లోటు 16 వేల కోట్ల‌యితే ఒక్క‌సారి మూడు వేల కోట్లు ఇచ్చి సిగ్గు లేకుండా చాలా ఇచ్చామంటారా?
పోల‌వ‌రం ఖ‌ర్చు 56 వేల కోట్లు అయితే... 4 వేల కోట్లు విదిల్చి చాలా ఇచ్చామంటారా?
రూపాయి విద‌ల్చ‌కుండా జాతీయ‌ విద్యాసంస్థ‌లు, అవి కూడా కొన్ని మాత్ర‌మే ప్ర‌క‌టిస్తూ.. ఇంకా ఏం ఇవ్వ‌లేదంటారా? నిధుల్లేకుండా పేక‌ల‌తో వాటి మేడ‌లు క‌ట్ట‌మంటావా?
మ‌తిమ‌రుపు పెద్ద‌మ‌నిషి మోడీ అమ‌రావ‌తిని ఢిల్లీని త‌ల‌ద‌న్నేలా నిర్మిస్తామ‌ని చెప్పి నాలుగేళ్ల‌లో ఎంతిచ్చాడు?
బెదిరించే వాళ్ల కాళ్లు ప‌ట్టుకుని... మ‌ర్యాదగా అడిగేవాళ్ల‌కు వెన్ను చూపే బ‌రి తెగింపు ఉత్త‌ర భార‌తంలో నీ ఓట్ల బ‌లుపు చూసుకునే క‌దా!
ఈరోజు దేశం పేరు ప్ర‌పంచంలో వినిపిస్తుందంటే... అది ఐటీ వ‌ల్ల‌. దానిని నిల‌బెడుతున్నది తెలుగు వాళ్లు. దేశం విలువ కాపాడే విదేశీ క‌రెన్సీ ఖ‌జానాను ఇండియాకు త‌న రెక్క‌ల క‌ష్టంతో నింపే వారిలో తెలుగు వారిదే అగ్ర‌పీఠం. నువ్వు ఎవ‌ర‌య్యా మా మీద సానుభూతి చూప‌డానికి?
నీ జేబులో డ‌బ్బులు ఇస్తున్నావా? లేక‌పోతే మోడీ టీకొట్టు పెట్టి సంపాదించిన డ‌బ్బులు ఏపీకి ఇస్తున్నావా?
టైం నీ ఒక్క‌డిదే కాదు జైట్లీ.... మాట‌లు జాగ్ర‌త్త !
అన్ని రోజులు నీవి కావు.
తెలుగు వారికి ఆత్మ‌గౌర‌వం ఉంది.
దాని దెబ్బ ఎలా ఉంటుందో కాంగ్రెస్ ని అడుగు. విన‌యంగా చెబుతుంది!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English