2.0 రిలీజ్ డేట్.. కొత్త కన్ఫ్యూజన్

2.0 రిలీజ్ డేట్.. కొత్త కన్ఫ్యూజన్

2.0 సినిమా నిజంగా ఎప్పుడొస్తుందో ఏమో కానీ.. ఈ లోపు ఇండస్ట్రీ జనాల్లో, అభిమానుల్లో విపరీతమైన గందరగోళానికి తెర తీస్తోంది. ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందో తెలియని సందిగ్ధత నెలకొంది. గత ఏడాది దీపావళి నుంచి ఈ ఏడాది జనవరి 25కు వాయిదా పడి.. అక్కడి నుంచి ఏప్రిల్‌కు మళ్లిన ఈ సినిమా సరిగ్గా ఏ తేదీకి వస్తుందనే విషయంలో స్పష్టత లేదు. ఏప్రిల్ 27 అని ఒకసారి.. ఏప్రిల్ 14 అని ఒకసారి భిన్నమైన ప్రకటనలు వచ్చాయి. కొన్ని రోజుల కిందట అభిమానులతో సమావేశంలో రజినీ మాట్లాడుతూ తమిళ సంవత్సరాది కానుకగా ఏప్రిల్ 14న ‘2.0’ సినిమా వస్తుందన్నాడు. కానీ ఇప్పుడు ఆయనే కొత్త డేట్ ఇచ్చాడు.

‘2.0’ను ఏప్రిల్ 27న రిలీజ్ చేద్దామనుకుంటున్నట్లు రజినీ వెల్లడించాడు. ఇందుకోసం విజువల్ ఎఫెక్ట్స్.. ఇతర పనులు చురుగ్గా సాగుతున్నట్లు రజినీ వెల్లడించాడు. రజినీ పూర్తి చేసిన మరో సినిమా ‘కాలా’ ఏప్రిల్ 14న విడుదలవుతుందని.. ‘2.0’ వాయిదా పడబోతోందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రజినీ ఈ సంగతి చెప్పాడు. మరి ఏప్రిల్ 27కే ‘2.0’ వచ్చేట్లయితే అదే తేదీకి రావడానికి పట్టుబట్టి కూర్చున్న ‘నా పేరు సూర్య’ సంగతేంటో చూడాలి. ‘2.0’ ఏప్రిల్ 27కే అనుకుంటున్నప్పటికీ విజువల్ ఎఫెక్ట్స్ పూర్తయ్యేదాన్ని బట్టే రిలీజ్ డేట్ ఖరారయ్యేలా ఉంది. ఐతే ఏ విషయంలో ఏప్రిల్ నెల ఆరంభంలో కానీ స్పష్టత వచ్చేలా లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English