గూగుల్‌ గుర్తించిన పప్పు రాహుల్ గాంధీ

గూగుల్‌ గుర్తించిన పప్పు రాహుల్ గాంధీ

తెలంగాణ ఏర్పాటుతోనే కాంగ్రెస్ చెయ్యి కాదు కదా చిటికెన వేలు కూడా వదిలేసిన టీఆరెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని లేవనివ్వకుండా చేసేందుకు పని మొదలుపెడుతోంది. బీజేపీకి మిత్రపక్షాలు దూరమవుతున్నాయి, ఆ పార్టీ బలహీనపడుతుందన్న భావన ఒకటి దేశంలో మొదలైన తరుణంలో వేగం పెంచడానికి సిద్ధమవుతున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణపై ఫోకస్ చేయనున్న నేపథ్యంలో టీఆరస్ ఇప్పుడు నేరుగా రాహుల్ నే టార్గెట్ చేసి విమర్శలు మొదలుపెట్టింది. మునుపెన్నడూ లేనట్లుగా టీఆరెస్ మంత్రి కేటీఆర్ రాహుల్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలో రాహుల్ గాంధీ కంటే పెద్ద పప్పు ఇంకెవరూ లేరంటూ ఆయన గూగుల్ కూడా ఆ విషయం గుర్తించిందంటూ ఆయన ఏకిపారేశారు.

    జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ప్రగల్బాలు పలికిందని, తాను సవాల్‌ చేస్తే ఎవరూ ముందుకు రాలేదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. పాలేరు ఉప ఎన్నికలోనూ సవాల్‌ చేయగా కాంగ్రెస్ నుంచి ఎవరూ దాన్ని స్వీకరించలేదని ఆయన అన్నారు. 2019 అధికారంలోకి రాకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటాన్న వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. జీహెచ్‌ఎంసీ, పాలేరు ఎన్నికల్లో, గద్వాలలో తాను చేసిన సవాల్‌పై కాంగ్రెస్ పార్టీ వెనక్కి వెళ్లిందన్నారు. ఇప్పటి వరకు జరిగిన ఏ ఉపఎన్నికలో కూడా కాంగ్రెస్‌కు గౌరవ ప్రదమైన ఓట్లు రాలేదు.  అలాంటి కాంగ్రెస్ నేతలు ఇప్పుడు వారికి 70 సీట్లు వస్తాయని అంటున్నారని... గుడారాల చాటున, కుటుంబం వెనకాల దాక్కుని ఉత్తమ్‌కుమార్ రెడ్డి సవాల్ నుంచి తప్పించుకుంటున్నరన్నారు.

     2019లోనూ ఒంటరిగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుస్తామని ఆయన అన్నారు. రాహుల్ ను నమ్ముకుని తెలంగాణ కాంగ్రెస్ నేతలు కలలు కంటున్నారన్నట్లుగా ఆయన తెలంగాణ కాంగ్రెస్ నేతలను, రాహుల్ ను ఒకేసారి ఏకిపడేశారు.  సొంత నియోజకవర్గంలో మున్సిపాలిటీని గెలిపించుకోలేని అసమర్థుడు రాహుల్ అని ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘మీ నాయకుడు పప్పు అని దేశమంతా తెలుసు.. గూగుల్‌లో వెతికినా అదే వస్తుంది’’ అంటూ ఆయన గాలి తీసేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English