అఖిల‌ప్రియ‌కు బాబు మ‌ళ్లీ అదే క్లాస్

అఖిల‌ప్రియ‌కు బాబు మ‌ళ్లీ అదే క్లాస్

వైసీపీ త‌ర‌ఫున ఎమ్మెల్యేగా గెలిచి పార్టీ ఫిరాయింపు ద్వారా మంత్రి ప‌ద‌వి చేప‌ట్టిన యువ ఎమ్మెల్యే అఖిలప్రియపై మ‌రోమారు టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఫైర‌య్యారు. పార్టీలో సీనియర్లను గౌరవిస్తూ పనిచేయాలని సూచించారు. పార్టీలో క్ర‌మ‌శిక్ష‌ణ ముఖ్య‌మని, గీత దాటితే ఉపేక్షించ‌డం ఉండ‌ద‌ని బాబు స్ప‌ష్టం చేసిన‌ట్లు స‌మాచారం. మంత్రి ప‌ద‌వి చేప‌ట్టిన అనంత‌రం చేసిన హెచ్చ‌రిక‌లే తాజాగా చంద్ర‌బాబు చేయ‌డం గ‌మ‌నార్హం.

కర్నూలు జిల్లా టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.విశ్వ‌స‌నీయ‌  సమాచారం ప్ర‌కారం కర్నూలు జిల్లా నేతల సమీక్షలో పలువురు నేతల తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విభేదాలు వీడి కలసి పనిచేయకుంటే కఠినంగా వ్యవహరిస్తానంటూ హెచ్చరించారు. కర్నూలు, కోడుమూరు, పాణ్యం, నంద్యాల నేతలకు చంద్రబాబు క్లాస్ తీసుకున్నార‌ని తెలుస్తోంది. వివాదాల కారణంగా కార్యకర్తలు ఇబ్బందులు పడితే సహించబోనని అన్న‌ట్లు స‌మాచారం. కర్నూలులో ఎంపీ టీజీ వెంకటేష్, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కలిసి పనిచేయాలన్నారు. నంద్యాలలో పార్టీ సీనియ‌ర్ నేత ఫరూక్, మంత్రి అఖిలప్రియల మధ్య విభేదాలపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. సీనియ‌ర్ల‌పై క‌లిసి ప‌నిచేయాల‌ని మంత్రి అఖిల‌ప్రియ‌ను ఆదేశించిన‌ట్లు తెలుస్తోంది. కొద్దికాలంగా త‌న‌కు వ‌చ్చిన ఫిర్యాదుల ఆధారంగానే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం.

నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి చేరిక అంశంపై సమావేశంలో ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. పార్టీలో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు తెలిపారు. విభేదాలు వీడి అందరూ కలసి పనిచేయాలని కర్నూలు జిల్లా నేతలను హెచ్చరించిన సీఎం చంద్రబాబునాయుడు వివాదాలున్న నియోజకవర్గాల్లో సమన్వయానికి ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి నేతృత్వంలో త్రిసభ్య కమిటీ వేశారు. కమిటీలో సభ్యులుగా కేఈతో పాటు మంత్రి కాల్వ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్ లను నియమించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English