జ‌న‌సేన ఆఫీసుకు ఆది లోనే కష్టం

జ‌న‌సేన ఆఫీసుకు ఆది లోనే కష్టం

జ‌న‌సేన అధినేత‌, ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌కు బ్యాడ్ న్యూస్. రాబోయే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఒక‌వైపు ప‌వ‌న్ ఫ్యాన్స్ సిద్ధ‌మ‌వుతుంటే....జ‌నసేనాని సైతం రెడీ అవుతుంటే ఊహించ‌ని షాకింగ్ న్యూస్ వినాల్సి వ‌చ్చింది. ఆయ‌న పార్టీ కార్యాల‌యాన్ని ఎత్తేశారు. సాక్షాత్తు పార్టీ శ్రేణులే ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం.

ఇంత‌కీ అసలేం జ‌రిగిందంటే...జ‌న‌సేన కార్య‌క్ర‌మాల్లో మ‌రింత వేగం పెంచేందుకు పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిర్ణ‌యం తీసుకొని ఏపీలో కార్యాల‌యాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. మంగ‌ళ‌గిరిలోని చిన‌కాక‌ని వ‌ద్ద పార్టీ ఆఫీసు ఏర్పాటుకు ప‌వ‌న్ ఓకే చేశారు. ఇందుకు భూమి ఇచ్చి రైతుల‌ను స‌న్మానించారు కూడా! అయితే అనూహ్యంగా పార్టీ కార్యాల‌యం వివాదంలో ప‌డిన విష‌యం తెర‌మీద‌కు వ‌చ్చింది. మ‌రోవైపు కొంద‌రు ముస్లింలు ప‌వ‌న్ తీరును, పార్టీ కార్యాల‌యం ఏర్పాటును త‌ప్పుప‌ట్టారు.

ఈ నేప‌థ్యంలో జనసేన తరపున పలువురు న్యాయవాదులు స్థానిక నేతలు ఆది, సోమవారాల్లో వివాదాస్పద స్థలంలో అన్నిరకాల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. స్థలం కోర్టు వివాదంలో ఉందని గుర్తించారు. జ‌న‌సేనాని ముందుగా చెప్పిన‌ట్లే..రికార్డులు స‌క్ర‌మంగా లేక‌పోయినా... ఇత‌ర‌త్రా స‌మ‌స్య‌లు ఉన్నా..పార్టీ ఆఫీసును తొల‌గిస్తామ‌ని ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డ్డారు. దీంతో అప్పటికే ఆ స్థలంలో తాత్కాలికంగా నిర్మితమైన రేకుల షెడ్లు, ఐరన్ రాడ్లన్నింటినీ పలు వాహనాల్లో అక్కడ నుంచి తరలించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English