స్పీకర్‌కు టీడీపీ ఎంపీల పేర్లు కూడా తెలియవా..?

స్పీకర్‌కు టీడీపీ ఎంపీల పేర్లు కూడా తెలియవా..?

పార్లమెంటులో ఏపీ ఎంపీలను చిన్నచూపు చూస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మొన్న కేవీపీ, నిన్న మాగంటి బాబుల విషయంలో సభాపతులు చేసిన వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఏపీకి జరుగుతున్న అన్యాయంపై లోక్ సభలో నిరసన తెలుపుతున్న తెలుగుదేశం పార్టీ ఎంపీల పట్ల లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చేసిన వ్యాఖ్యలను పలువురు తప్పు పడుతున్నారు.. సభా కార్యక్రమాలకు ఆటంకం కలుగుతోందని.. చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తున్నారని ఆమె అన్నారు. ఇలా అయితే ఇంట్లో పిల్లల్ని కూడా క్రమశిక్షణలో పెట్టుకోలేరంటూ వ్యాఖ్యానించారు. ఏపీ సమస్యలపై పోరాడుతుంటే ఆమె అలా చిన్నపిల్లలా అనడం సరికాదని టీడీపీ నేతలు అంటున్నారు.

కాగా ఆమె మాగంటి బాబు విషయంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే... రెండు సార్లు లోక్ సభ సభ్యుడు అయినా మాగంటి బాబు పేరు కూడా ఆమెకు తెలియకపోవడం కూడా విమర్శలకు దారితీస్తోంది. వెల్ లోకి దూసుకొచ్చి టీడీపీ ఎంపీలు నిరసన తెలిపే క్రమంలో మాగంటి బాబు స్పీకర్‌ స్థానానికి ఎదురుగా నిల్చుని ప్లకార్డు ప్రదర్శించారు. ఆ ప్లకార్డు తనకు అడ్డుగా ఉండటంతో ఆమె తీవ్ర అసహనానికి గురయ్యారు. వెంటనే సహాయకుడిని పిలిచి ఆ ఎంపీ పేరేంటని అడిగారు.. మాగంటి వెంకటేశ్వరరావు అని సహాయకుడు చెప్పగా స్పీకర్‌.. ‘మిస్టర్‌ వెంకటేశ్వరరావు ప్లకార్డు పట్టుకోవడంలో నేను సాయం చేయనా?’ అంటూ అసహనంతో ప్రశ్నించారు. చిన్న పిల్లల్లా ప్రవర్తించొద్దని అన్నారు.  వారించడం మాటెలా ఉన్నా... ప్రస్తుత సభలో నాలుగేళ్లుగా ఉన్న మాగంటి బాబు పలు పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడు కూడా. అయినా, ఆయన పేరు కూడా స్పీకర్ కు తెలియకపోవడం విశేషం.

మరోవైపు రాజ్యసభలో కూడా ఇటీవల కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావును డిప్యూటీ చైర్మన్ కురియన్ ఇలానే అన్నారు. నువ్వేమైనా పిచ్చోడివా అంటూ కురియన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో ఏపీ ఎంపీలంటే పార్లమెంటులో అధికార పక్షానికి చిన్నచూపు ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English