ఎంపీ క‌విత ఏం చేసిందో తెలుసా?

ఎంపీ క‌విత ఏం చేసిందో తెలుసా?

ప‌దునైన విమ‌ర్శ‌లు, స్ప‌ష్ట‌మైన ఎదురుదాడి చేయ‌డంలో ముందుండే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత తనలో మ‌రో గుణం కూడా ఉంద‌ని చాటిచెప్పారు. సంద‌ర్భం వ‌స్తే త‌ను ఎంత ఉదారంగా స్పందిస్తానో తెలియ‌జెప్పారు. త‌న‌లో ఉన్న సేవాగుణాన్ని ఆమె మరోసారి చాటిచెప్పారు. కుటుంబాన్ని ఆదుకోవ‌డ‌మే కాకుండా...ఏకంగా ఆడ‌బిడ్డ పెళ్లికి ఆర్థిక స‌హాయం చేశారు. స‌ర్పంచ్ పదవిలో ఉండి ప్రమాదవశాత్తు మృతి చెందిన మోచి బాలరాజు కుటుంబానికి ఆమె అండగా నిలిచారు. పెద్దదిక్కును కోల్పోయిన ఆ కుటుంబానికి అన్నీ తానై ఎంపీ కవిత చూసుకుంటున్నారు. దివంగత సర్పంచ్ కుమార్తె భారతి పెళ్లికి కవిత ఆర్థిక సాయం చేసి.. పలువురికి ఆదర్శంగా నిలిచారు.

నిజామాబాద్ జిల్లాలోని బినోల గ్రామ టీఆర్‌ఎస్ సర్పంచ్ మోచి బాలరాజు ప్రమాదవశాత్తు మురికి కాల్వలో పడి 2016, మార్చి 12న మృతి చెందాడు. నాడు.. మోచి బాలరాజు అంత్యక్రియల ఖర్చును కవిత భరించారు. దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకున్నారు. బాలరాజు కుమార్తె భారతికి నిజామాబాద్ జిల్లాలో ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో ఔట్ సోర్సింగ్ కింద జాబ్ ఇప్పించి.. ఆర్థికంగా ఆదుకున్నారు. ఇక భారతి వివాహం మార్చి నెలలో ఉండటంతో.. పెళ్లి ఖర్చుల కోసమని కవిత రూ. 3 లక్షల నగదును ఇచ్చారు. ఈ నగదును టీఆర్‌ఎస్ అధికారులు.. భారతికి ఇవాళ అందజేశారు. ఎంపీ కవితకు రుణపడి ఉంటామని భారతి, ఆమె తల్లి ఉద్వేగానికి లోనయ్యారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English