ఫేస్‌బుక్‌ ఫేక్ అకౌంట్లలో మ‌నోల్లే టాప్‌

ఫేస్‌బుక్‌ ఫేక్ అకౌంట్లలో మ‌నోల్లే టాప్‌

సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ఫేస్‌బుక్ మ‌నోళ్ల ఆలోచ‌న తీరు గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఒక‌టి పంచుకుంది. న‌కిలీలలో మ‌న‌కెంత ఆస‌క్తి ఉందో తెలియ‌జెప్పింది. ఫేస్‌బుక్‌లో 20 కోట్ల ఫేక్ అకౌంట్లు ఉన్నట్లు తేల్చింది. ఫేస్‌బుక్‌ ప్రకటించిన 2017 డిసెంబర్‌ నాటి వార్షిక నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఈ నకిలీ ఖాతాలు అధికంగా భారత్‌లోనే ఉన్నట్లు వెల్లడించింది.

2017 నాలుగో త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెల‌వారీ ఆక్టివ్‌ యూజర్లు (MAU)లలో 10 శాతం ఫేక్ అకౌంట్లే అని అంచనా వేసింది. అలాగే ఈ ఫేక్ అకౌంట్లున్న దేశాల్లో తొలి స్థానాల్లో ఇండియా, ఇండోనేసియా, పిలిప్పిన్స్‌ ఉన్నట్లు తెలిపింది.

2017 చివరి నాటికి మొత్తం 2.13 బిలియన్ల నెల‌వారీ యాక్టివ్ వినియోగ‌దారులు  ఉన్నారని, 2016తో పోలిస్తే 14 శాతం MAUలు పెరిగారని తెలిపింది. 2017లో ఖాతాలు పెరగడానికి భారత్, ఇండోనేసియా, వియత్నాం దేశాలే కారణమని వివరించింది. ఒక వాడకందారుడికి ఒకటి కంటే ఎక్కువ ఖాతాలుంటే.. అందులో మొదటి ఖాతా మినహా మిగతావన్నీ నకిలీవేనని స్పష్టం చేసింది. ఇద‌న్న‌మాట న‌కిలీల్లో మ‌న స‌త్తా!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు