సర్వేలు - పంపకాలు

సర్వేలు - పంపకాలు

2014లో సాధారణ ఎన్నికలు జరగనుండడంతో దేశమంతటా సర్వేల జోరు పెరిగింది. వివిధ సర్వేలో దేశంలోని రాజకీయ పరిస్థితులను అంచనాలు వేసి, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్నదానిపై తమ తమ ఫలితాలను వెల్లడిస్తున్నాయి. ఇవి వాస్తవ ఫలితాలు కావుగాని, వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉండే అవకాశం లేకపోలేదు. కాని సర్వేలు తప్పుదారిన నడుస్తున్నాయని, రాజకీయ పార్టీలే డబ్బు సమకూర్చి సర్వేలు చేయించినట్టుగా తమ ప్రాపకం పెంచుకుంటున్నాయనే విమర్శ ఒకటి ఉన్నది.

అదలా ఉంచితే, రాష్ట్రంలో లోక్‌ సభ ఎన్నికలలో మిశ్రమ ఫలితాలు వస్తాయని హెడ్‌ లైన్స్‌ టుడే, సి.ఓటర్‌ సర్వే వెల్లడిస్తోంది. ఆ అంచనాని బట్టి చూస్తే వైఎస్‌.ఆర్‌.కాంగ్రెస్‌కు 11, టిఆర్‌ఎస్‌కు 11, టిడిపికి 10, కాంగ్రెస్‌కు 8 సీట్లు బిజెపి, ఎమ్‌.ఐ.ఎమ్‌ లకు చెరొక సీట్లు వస్తాయట. జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ సర్వే ఫలితాలను పంచినట్లుగా కనిపిస్తున్నది. ఈ సర్వే అంచనా కాంగ్రెస్‌, టిడిపిలకు ఊరట కలిగించగా, టిఆర్‌ఎస్‌కి కొండంత బలాన్ని ఇచ్చింది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ డీలా పడే అంచనాలే ఇవి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు