ఫ్యాన్ మేడ్ పోస్టర్ కే పిచ్చెక్కిపోతే..

ఫ్యాన్ మేడ్ పోస్టర్ కే పిచ్చెక్కిపోతే..

హీరోలు అంటే అభిమానించడం సహజం. సౌత్ లో అయితే ఈ అభిమానం మరీ ఎక్కువగా ఉంటుంది. హీరోలను ఏకంగా దేవుళ్లు చేసి మరీ భక్తి ప్రపత్తులు చాటేస్తుంటారు ఫ్యాన్స్. ఇక తమ హీరోకి సంబంధించిన అప్ డేట్స్ వస్తే హంగామా చేసేయడం కనిపిస్తూ ఉంటుంది.

తమ హీరో సినిమాకి ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చినపుడు.. అభిమానులు హంగామా చేయడం సహజం. కానీ తమిళనాడులో ఈ ట్రెండ్ మరింతగా పెరిగిపోతోంది. రీసెంట్ గా తానా సెరేంద్ర కూట్టంతో మంచి హిట్ కొట్టాడు సూర్య. ఇప్పుడు సెల్వరాఘవన్ దర్శకత్వంతో ఓ సినిమా చేస్తున్నాడు ఈ తమిళ స్టార్ హీరో. సూర్య 36 అంటూ ఇప్పటికే ఈ సినిమాపై హంగామా నడిచేస్తోంది. ఈ మధ్యన సూర్య అభిమానులు కొందరు సూర్య36 అంటూ ఓ పోస్టర్ ను తయారు చేసేసి.. నెట్ లో హంగామా చేసేస్తున్నారు. ఇంతవరకూ ఏ హీరోకి అయినా కనిపిస్తూనే ఉంటుంది. కానీ ఇదే పోస్టర్ ని థియేటర్ల దగ్గర ఫ్లెక్సీలు పెట్టేస్తున్నారు.

సినిమా రిలీజ్ కి ముందు ఫ్లెక్సీలు పెట్టడం కామన్. కానీ ఈ ఫ్యాన్ మేడ్ పోస్టర్ ను కూడా థియేటర్ల దగ్గర పోస్టర్లు పెట్టేసి హంగామా చేసేస్తున్నారు సూర్య అభిమానులు. అభిమానం ఉంటుంది కానీ.. మరీ ఈ స్థాయిలో మాత్రం అరుదుగానే చూస్తుంటాం. అభిమానం చూపించడం విషయంలో.. తమిళనాడు జనాలు కొత్త ట్రెండ్ సృష్టించేట్లుగా ఉన్నారు. ఫ్యాన్ మేడ్ పోస్టర్ కే ఇంత పిచ్చి ప్రదర్శిస్తే.. ఇక ముందు ఇంకా ఎన్ని విచిత్రాలు చూపిస్తారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు