పవనిజం అర్ధం చెప్పిన భీమవరం సూర్రాజు

పవనిజం అర్ధం చెప్పిన భీమవరం సూర్రాజు

ఫిలిం ఫంక్షన్స్ నిర్వహించేందుకు.. విభిన్నమైన ప్రాంతాలను ఎన్నుకుంటున్నారు సినిమా జనాలు. గతంలో ఎక్కువగా హైద్రాబాద్ లోనే సినిమా ఫంక్షన్స్ జరగగా.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇతర పట్టణాలను కూడా ఈవెంట్స్ కు ఎంపిక చేస్తున్నారు మేకర్స్. వరుణ్ తేజ్ నటించిన తొలిప్రేమ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను భీమవరంలో నిర్వహించారు.

ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో.. జబర్దస్త్ స్టార్ హైపర్ ఆది కూడా నటించాడు. తొలిప్రేమలో ఇతని పేరు భీమవరం సూర్రాజు కావడం హైలైట్. స్టేజ్ మీదకు వచ్చినప్పటి నుంచి పంచ్ లు వేస్తూ అలరించాడు సూర్రాజు అలియాస్ హైపర్ ఆది. పూతరేకుల్లాంటి అమ్మాయిలు.. బొబ్బట్ల లాంటి అబ్బాయిలు.. భీమవరం చేపల్లాంటి అతిథులు అంటూ.. చమత్కరంచిన ఆది.. ఈ సినిమాలో ఎక్కువ భాగం షూటింగ్ లండన్ లో చేసినట్లు చెప్పుకొచ్చాడు. తనకు జోడీ ఎవరూ దొరక్కపోవడంతో.. దర్శకుడితోనే ప్రేమలో పడ్డానని అన్నాడు.

భీమవరంలో దిగగానే ఓ వ్యక్తి పవనిజం అంటే అర్ధం చెప్పమని హైపర్ ఆదిని అడిగాడట. 'ఒక్కసారి అభిమానించడం మొదలుపెడితే.. చచ్చేవరకూ పవన్ కళ్యాణ్ ను అభిమానిస్తూనే ఉంటాం. ఇది నిజం.. ఇదే పవనిజం' అంటూ పవనిజంకు తనదైన నిర్వచనం ఇచ్చాడు ఆది. ప్రతీ ఒక్కరూ పవన్ కళ్యాణ్ ను ప్రేమిస్తారని.. కానీ ఎవరికైనా సరే తొలిప్రేమ అమ్మానాన్నలతోనే అంటూ సెంటిమెంటల్ టచ్ కూడా ఇవ్వడం హైలైట్.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English